జనవిజయంఆంధ్రప్రదేశ్మీడియా స్వేచ్చకు కళ్లెం వేసే యత్నాలు-జగన్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

మీడియా స్వేచ్చకు కళ్లెం వేసే యత్నాలు-జగన్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

విజయవాడ, జూన్ 1(జనవిజయం): జగన్ సర్కార్ ప్రజాస్వామ్యానికి నాల్గో సంభమైన మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం మానుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. మంగళవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ చానెళ్లపై రాజద్రోహం కేసులు పెట్టడం సమంజనం కాదని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించడం హర్షనీయమని చెప్పారు. ఏలూరు మెడికల్ కాలేజీకి మూడుసార్లు శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019 ఫిబ్రవరిలో తొలిసారి చంద్రబాబు, 2019 అక్టోబర్ 4న రెండోసారి జగన్, 2021 మే 31వ తేదీన ముచ్చటగా మూడోసారి జగన్ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితి మిగతా వైద్య కళాశాలలకు రాకుండా జగన్ ప్రభుత్వం జాగ్రత్త పడాలన్నారు. ఇకపోతే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్వీ ప్రసాద్ మృతి దిగ్భాంతి కరమన్నారు. ఆయన నీతి, నిజాయితీకి నిలువుటద్ధం అని కొనియాడారు. నీలం సంజీవరెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా తులసిరెడ్డి నివాళులర్పించారు. కోర్ట్ ఒక్కసారి ప్రతికూల వ్యాఖ్యలు చేసినందుకే సీఎం పదవికే రాజీనామా చేశారని, కానీ నేటి నాయకులు కోర్టులు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా పట్టించుకోరని తులసిరెడ్డి అన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి