జనవిజయంఆంధ్రప్రదేశ్మీడియాపై కేసులు అన్యాయం

మీడియాపై కేసులు అన్యాయం

అమరావతి, మే 16 (జనవిజయం): మీడియా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు బనాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రత్యర్ధులపై పెట్టిన కేసుల్లో మీడియాను కుట్రదారులుగా ఇరికించడం కక్ష సాధింపు తప్ప మరోటికాదని, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో భాగస్వాములను చేస్తూ టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై ఏపీ సీఐడీ నమోదుచేసిన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఎంపీ రఘురామకృష్ణం రాజుపై పెట్టిన దేశద్రోహం కేసు ఎఫ్ఐఆర్‌లో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లను కుట్రదారులుగా పేర్కొనడం ప్రభుత్వ నిరంకుశ ధోరణిని ప్రతిబింబిస్తోందని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్ పేర్కొన్నారు.

ప్రభుత్వానికి నచ్చని వార్తా కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ప్రభుత్వ విభాగాలు కేసులు పెట్టడానికి వీలు కల్పిస్తూ 2430 నంబర్ జీవోను జారీ చేసిన ప్రభుత్వం ఇంకా అదే ధోరణిలో ఉన్న సంగతిని ఈ తాజా కేసు ధృవీకరిస్తోందన్నారు. ప్రభుత్వం బనాయించిన ఈ కేసు భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై బాహాటంగా దాడి చేయడమేనని, రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛలోనే మీడియా స్వేచ్ఛ ఇమిడి ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మీడియాపై ఈ రకమైన దాడులు ప్రజల హక్కులపై దాడుల కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అంతే కాకుండా, ప్రజలకున్న తెలుసుకునే హక్కును హరించడం కిందకు కూడా వస్తుందని, వార్తా సేకరణ, ప్రజలకు చేరవేత మీడియా నిర్వహించే పవిత్రమైన కార్యక్రమమని, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇది ప్రాణాధారం, ప్రభుత్వం ఇప్పుడీ కేసు పెట్టడం దీనికి విఘాతం కలిగించేందుకే అనుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ఇలాటి చర్యలను ఖండించాల్సిందిగా ప్రజాస్వామికవాదులకు పిలుపునిచ్చారు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధస్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యులు డి.సోమసుందర్, నల్లి ధర్మారావు, ఆలపాటి సురేష్‌కుమార్.

మరోవైపు, పలు రకాల అభియోగాలపై రాష్ట్రంలో తాజాగా మీడియాపై నమోదు చేస్తున్న కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, అసలు కేసులు నమోదుకు ముందుగా వివరణ కోరడం సత్ సంప్రదాయమన్న విషయాన్ని గ్రహిస్తే మంచిదనీ, అన్నింటికి మించి ముందుగా ఇప్పటికే కరోనాతో అకాల మరణాలకు గురైన దాదాపు 79 మంది జర్నలిస్టులకు సంబంధించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజయవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ఐజేయూ సభ్యుడు పాతర్ల రమేష్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకై అన్ని రకాల చర్యలు చేపట్టాలని కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి