బోనకల్, జూలై 19 (జనవిజయం) :
గోవిందాపురం (ఏ) గ్రామానికి చెందిన భాగం రాకేష్ భాగం సేవా ఫౌండేషన్ ద్వారా ఆళ్లపాడు గ్రామంలో ముస్లిం సోదరులకు పీరుల సావిడి, మసీదులో సుమారు 20,000 రూపాయలు విలువ చేసే ఎల్ఈడీ లైట్లు ముస్లిం పెద్దలకు అందజేశారు. ఆళ్లపాడు ముత్యాలమ్మ తల్లి గుడికి ఒక ఎల్ఈడి లైటును గ్రామానికీ చెందిన బరకయ్య కి అందజేశారు. రాకేష్ చేస్తున్న సహాయానికి ఆళ్లపాడు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ ఎల్ఇడి లైట్లను రాకేష్ తండ్రి భాగం రాధాకృష్ణమూర్తి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగం పాపారావు, భాగం నాగేశ్వరరావు, షేక్ పకీర్ సాహెబ్, అనబోతు శ్రీనివాసరావు, వడ్డెబోయిన ఉపేంద్ర, పొట్ట పెంజర గోపి పాల్గొన్నారు.