జనవిజయంతెలంగాణమారుతున్న తెలంగాణ రాజకీయం

మారుతున్న తెలంగాణ రాజకీయం

  • పెద్దిరెడ్డి వ్యవహారం వెనక టిఆర్ఎన్ వ్యూహం?
  • ఈటెల బిజెపిలోకి వస్తే… టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి
  • మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం

కరీంనగర్, మే 29(జనవిజయం): తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటెల చుట్టూ రాజకీయలు ఉన్నాయి. ఆయన వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు చర్చ. కరోనా కారణంగా పెద్దగా జనం పట్టించుకోవడం లేదు కానీ లేకుంటే.. దీనిపై గట్టిగానే చర్చ జరిగేది. టిఆర్ఎన్ కూడా ఈటెల విషయంలో వేచిచూసే ధోరిణిని అవలంబిస్తోంది. కేవలం గంగుల కమలాకర్ మాత్రమే విమర్శలకు పదను పెడుతున్నారు. రోజుకొకరిని పార్టీలో చేర్చుకుంటూ హంగామా చేస్తున్నారు. సిఎం కెసిఆర్ కూడా ఆయనకు మాత్రమే అధికారం ఇచ్చారని సమాచారం. అందుకే టిఆర్ఎస్ నుంచి ఎవరు కూడా మాట్లాడడం లేదు. కేవలం గంగుల మాత్రమే ఉమ్మడి జిల్లాలో ప్రకటనలు చేస్తున్నారు. దీనికితోడుహుజారాబాద్ నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బిజెపిక చెందిన చోటామోటా లీడర్లతో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇకపోతే బిజెపిలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఈటల బిజెపిలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా టీఆర్ఎస్ నడిపిస్తున్నదిగా బిజెపి నాయకత్వం కూడా భావిస్తోంది. మొత్తంగా ఇప్పుడు ఈటల తదుపరి ఎలాంటి అడుగు వేస్తారని ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ బిజెపిలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. జూన్ 2 న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల నూతప్రాయంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినం రోజున ఆయమన ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలా అయితే హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఈ ఉపఎన్నికల్లో ఎవరినీ బరిలోకి దించాలనేది టీఆర్ఎస్ కు పెద్ద సవాలుగా మారనుంది. ఎందుకంటే హుజూరాబాద్ లో ఈటల స్థాయి నాయకులు ఎవరు లేరు. పక్క నియోజకవర్గంలో నుంచి ఓ నాయకున్ని తెచ్చుకోవాలి? లేదా ఇతర పార్టీల లీడర్ కు గాలం వేయాల్సిందే. అయితే గులాబీ బాస్.. ఇతర పార్టీ లీడర్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈటల బిజేపి లోకి చేరగానే.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. అందుకే పెద్దిరెడ్డి ఈటల రాకను8 వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యూహంపై ఇప్పటికే ట్రబుల్ షూటర్ కు ఆదేశాలు వెళ్లాయని టాక్. అన్ని అనుకుంటే పెద్దిరెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయననే హుజూరాబాద్ అభ్యర్థి అవుతారని అంటున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి