తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్, జులై 20 (జనవిజయం):
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వానలు మరింత పెరిగే సూచనలున్నాయని పేర్కొంది.
మరో వైపు మరో ఐదురోజులు రాష్ట్రంలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 9000113667 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
పెద్దలు బయటికి అవసరం ఉంటే తప్ప రావద్దు పిల్లలని బయటికి పంపించే ప్రయత్నాలు చెయ్యొద్దు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ వైర్లు తెగి నీళ్లలో లేదా రోడ్లపై పడుతుంటాయి ఈ భారీ వర్షాలకు నడిచేటప్పుడు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చెట్ల కింద, స్తంభాల దగ్గర, డ్రైనేజీ కాలువలు దగ్గర, ఉండకండి వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు చేయకుండా ఉండండి ఈ భారీ వర్షాలు తగ్గే వరకు అందరు జాగ్రత్త వహించండి.