Saturday, February 24, 2024
Homeరాజకీయంతీరుమారని బిఆర్‌ఎస్‌ నేతలు

తీరుమారని బిఆర్‌ఎస్‌ నేతలు

  • కృష్ణాజలాలపై అబద్దాలతో వంచన
  • గతమంతా బంగారు తెలంగాణతో మోసం

హైదరాబాద్‌,ఫిబ్రవరి10: అసెంబ్లీలో కూడా అబద్దాలు చెప్పడం ద్వారా బిఆర్‌ఎస్‌ తన అహంభావాన్ని మరోమారు చాటుకుంది. కృష్ణా జలాల విషయంలో ఆ పార్టీ చేసిన వాదన పసలేనిది. గత పదేళ్ల పాలనలో అబద్ధాలు, అర్థరaసత్యాలతో ప్రజలను మోసం చేశారు. తెలంగాణను దివాళా తీయిం చారు. ఓ నలుగురి కోసం మొత్తం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారు. అబద్దాలు ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. మేడిపండు చందంగా అభివృద్ది డొల్ల అని తేలింది. అయినా బింకం చావలేదు. అహం వీడలేదు. అసెంబ్లీలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రెండు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్‌నామ్‌ చేయాలన్న వాదాన్ని పాటించారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు.  తెలంగాణ ప్రత్యేక రాష్టార్రగా ఏర్పడ్డా ..బంగారు తెలంగాణ.. కల సాకారం కాలేదు. తెలంగాణ ఏర్పడితే అంతా మంచే జరుగుతుందనుకున్న వారు మోసపోయారు. బలిదానాలు ఇచ్చిన వారి కుటుంబాల అతీగతీ లేదు. ప్రజలకు ఊరట దక్కలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు. ఉపాధి కోసం ఎదురు చూసిన వారి కళ్లు కాయలు కాస్తున్నా పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ జెండా మోసిన వారంతా దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రగతి భవన్‌ సామాన్యులకు అందుబాటు

లో లేకుండా చేశారు. నాటి సిఎం కెసిఆర్‌ను కలవాలనుకుంటే కుదరదని శిలాశాసనం రాసారు. గతంలో ఉమ్మడి ఎపిలో సిఎంలను కలవాలనుకుంటే ఇంతగా ఇబ్బంది ఉండేది కాదు. జెండాలు మోసిన జర్నలిస్టులు అధోగతి పాలయ్యారు. వారిని పురుగుల కన్నా హీనంగా చూసారు. ఏ పని చేసినా ఓట్లు రాబట్టుకునే ఆలోచనలో నాటి తెలంగాణ ప్రభుత్వం నడిచింది. దానినే బంగారు తెలంగాణ అంటూ ఊదర గొట్టారు. ప్రధానంగా ధరణిపై వచ్చిన ఆరోపణలను సరిదిద్దుకునే ప్రయత్నం చయకుండా ఎదురుదాడికి దిగారు.  తప్పులు జరిగితే..ధరణి మొత్తం బాగాలేదని అంటున్నా రని ఎదురుదాడి చేసారు. అసెంబ్లీలో మంత్రులు దీనిపై వివరణ ఇచ్చి తప్పులు చెబితే ఒప్పుకోవడం కూడా చేతకావడం లేదు. సరిదిద్దుకుం టామని చెప్పలేకపోయారు. ఈ దశలో ఇప్పుడు రేవంత్‌ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన గత వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. గతంలో ప్రజలు ఎలా ఉన్నారో ఎప్పూడూ ఆరా తీయలేదు. అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయో కనుక్కోలేదు. ఎపిలోనూ గత ఐదేళ్లుగా జగన్‌ పాలన కూడా అలాగే సాగింది. ఒక్క అవకాశం అంటూ గద్దె నెక్కిన జగన్‌ పాలన ఎలా ఉందో ప్రపంచమంతా చూస్తోంది. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన ఓ నేత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు రోడ్డెక్కినా పోలీసులు కేసులు పెడుతున్నారు. లోకేశ్‌ పాదయాత్రను అడుగడుగునా.. అడ్డుకున్నారు. అమరావతి పై కేంద్రం ప్రకటనతో కిమ్మనడం లేదు. వైఎస్‌ వివేకా హత్య కేసుపైనా పెదవివిప్పడం లేదు. ఈ సమస్యలను నిలదీయాల్సిన బాధ్యతను ఇప్పుడు షర్మిల చేపట్టారు.  ఇకపోతే ఉమ్మడి ఎపిలో ఉన్న నీటి పంచాయితీలే మరింత ఎక్కువగా మళ్లీ మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయి.  ప్రజల అమాయకత్వాన్ని, అవసరాలను క్యాష్‌ చేసుకోవడం నేటి రాజకీయంగా మారింది. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ది లోపించంది.  ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేసుకున్న షర్మిల ఇప్పుడు అన్న అక్రమాలను నిలదీస్తు న్నారు. నిజానికి ఎపిలో రాజన్నరాజ్యం నడవాలి. కానీ అక్కడంతా అరాచక రాజ్యం నడుస్తోంది. రాజధాని అన్నది లేకుండా…మూడు రాజధానులు ఉండాలన్న విపరీత ఆలోచనలు చేస్తున్న పాలకులు ఉన్నారు. రాజధాని లేకుండా రాజ్యం చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో షర్మిల ప్రశ్నించడంతో నేతలు ఉక్కిరికిబిక్కిరి అవుతున్నారు. మొత్తంగా తెలంగాణ మాదిరి ఎపిలోనూ మంచి జరగాలని కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments