జనవిజయంతెలంగాణమంత్రి నిరంజన్‌తో టీసాట్ చర్చ

మంత్రి నిరంజన్‌తో టీసాట్ చర్చ

హైదరాబాద్, మే 16 (జనవిజయం): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ నెల 18వ తేదీన జూబ్లీహిల్స్‌లోని టి-సాట్ స్టూడియోకు హాజరవనున్నారు. ‘వానా కాలం సాగుకు సమాయత్తం’ పేరుతో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు గంటల పాటు తెలంగాణ రైతులకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ద్వారా పలు సలహాలు-సూచనలు అందివ్వనున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల సమయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న రైతులకు వానా కాలం సాగు విషయంలో పలు అంశాలపై టి-సాట్ టీవి, నెట్వర్క్ ద్వార అవగాహన కల్పించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సిద్ధమయ్యాయారు. మంగళవారం జరిగే ప్రత్యేక లైవ్ షో కార్యక్రమంలో మంత్రితో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఇతర సాంకేతిక అధికారులు పాల్గొని రైతులకు తగిన సలహాలు-సూచనలు అందివ్వనున్నట్లు టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ, విద్యతో పాటు టి-సాట్ యూట్యూబ్ tsatnetwork/youtube, యాప్ tsat.tv వేదిక ద్వార లైవ్ అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని తెలంగాణ రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి