Thursday, October 5, 2023
Homeవార్తలుమణిపూర్ ఘటన యావత్ భారత మహిళా లోకానికి మచ్చ

మణిపూర్ ఘటన యావత్ భారత మహిళా లోకానికి మచ్చ

దుండగులపై సుమోటోగా కేసును  స్వీకరించాలి!

యావత్ భారత మహిళా లోకానికి మచ్చ

  • తెలంగాణ రాష్ట్ర గోండ్వానా సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పాయం సత్యనారాయణ

భద్రాచలం, జూలై 20(జనవిజయం): 

మణిపూర్ రాష్ట్రంలో కుకి గిరిజన తెగకు చెందిన ఇద్దరు మహిళలను గిరిజనేతర వర్గాలు వివస్త్రను చేసి ఊరేగింపుగా తీసుకొచ్చి మానభంగం చేయడం యావత్ భారత మహిళా లోకానికి మచ్చ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన మన భారతదేశంలో అనగారిన వర్గాలైన గిరిజన తెగలకు చెందిన మహిళలను  ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూలన  మానభంగాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర గోండ్వానా సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఒక ప్రకటనలో ఆరోపించారు.

మణిపూర్ రాష్ట్రంలో గత కొంతకాలం నుండి వలస గిరిజనే తరులకు మరియు కుకి గిరిజన తెగల మధ్య ప్రచ్చన్న యుద్ధంలా రాష్ట్రం రావణ కాస్టంలా మారుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోకపోవడం మూలంగా గిరిజన మహిళలను వివస్త్రను చేసి ఊరేగింపుగా తీసుకొచ్చి  నీచంగా మానభంగం చేసిన దుండగులపై సుమోటోగా కేసును  స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులో ఒక గిరిజన యువకుడిని రౌడీ మూకలు అత్యంత పాసవికంగా దాడి చేసి మృగంలా వ్యవహరించి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆ యువకుడు పై దుండగులు మూత్రం పోసిన సంఘటనలు జరిగాయని, ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments