మణిపూర్ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
- భద్రాచలంలో జర్నలిస్ట్ ల నిరసన
భద్రాచలం, జూలై 22 (జనవిజయం):
మణిపూర్ లో మహిళలపై అత్యాచారం, హత్య నిందితులను శిక్షించాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. శనివారం వివిధ పత్రికలకు చెందిన పాత్రికేయులు భద్రాచలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం లో ప్రెసక్లబ్ అధ్యక్షులు బి వి రమణారెడ్డి, కార్యదర్శి మోబగాపు ఆనంద్, కోడూరి సత్యనారాయణ, సోమరౌతు శ్రీనివాసరావు, తోకల నాగేశ్వరరావు, యర్రంశెట్టి కృష్ణ, బందు కిరణ్, వెంకట్, శ్రీశ్రీ తదితరులు పాల్గొన్నారు.