మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలి: ఐద్వా
బోనకల్, జూలై 21(జనవిజయం):
మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లను, హింసను అదుపు చేసి శాంతిని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రావినూతలలో నిరసన చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గుగులోతు శారద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అల్లర్లను నిలుపుదల చేసి ప్రజలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, మహిళలపై అకృత్యాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, హింసను ఆపడం కోసం అఖిల పక్షంతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఆ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలల నుండి మణిపూర్ లో హింస చెలరేగుతున్నా శాంతి భద్రతలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆమె ఆరోపించారు. అన్నదమ్ముల వలె కలిసి ఉన్న తెగల మధ్య వైషమ్యాలు పెంచడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ధరావతు సునీత, ధరావత్ అచ్చమ్మ ధరావత్ బుజ్జి గుగులోతు.లక్ష్మి బానోతు మంగా భాణోతు సరోజ,గుగ్లోత్ భారతి ,బాణోతు.ఆదెమ్మ గిరిజన సంఘం నాయకులు బాణోతు. నాగేశ్వరరావు భానోత్ రావుజ తదితరులు పాల్గొన్నారు