Tuesday, October 3, 2023
Homeవార్తలు75ఏళ్ల స్వతంత్ర భారతంలో మణిపూర్ లాంటి ఘటనలు దురదృష్టకరం

75ఏళ్ల స్వతంత్ర భారతంలో మణిపూర్ లాంటి ఘటనలు దురదృష్టకరం

75ఏళ్ల స్వతంత్ర భారతంలో మణిపూర్ లాంటి ఘటనలు దురదృష్టకారం

  • బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదు
  • ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భానోత్ శ్రీనివాసరావు

బోనకల్, జూలై 23(జనవిజయం):

మణిపూర్ రాష్ట్రం కుకి ప్రాంతంలో ముగ్గురు మహిళలలను వివస్త్రలను చేసి నగ్నం గా ఉరేగించి హత్యాయత్నంకి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భానోత్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.75ఏళ్ల స్వతంత్ర భారతంలో మణిపూర్ లాంటి ఘటనలు దురదృష్ట మని,బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదని అన్నారు.ఘటనపై శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కుకి ప్రాంతం లో నివసిస్తున్న ప్రజలపై అల్లరి మూకల దాడి ఘటన అత్యంత భాదకరమైనది ,ఈ సంఘటన మే 4 న జరిగిన ఇప్పటి వరకు వెలుగులోకి రావకపోవడం శోచనీయమని అక్కడ ఎక్కువ శాతం మంది నివసించే క్రైస్తవులపై భౌతిక దాడులుచేస్తూ ప్రార్థనా మందిరాలను తగలబెట్టి అత్యంత పాశవికంగా వ్యవహరిస్తున్న అల్లరి మూకలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోక పోవడం, వారి నిరంకుశ పాలన కు నిదర్శనం అని అన్నారు.బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ని అడ్డుకోవడం సరికాదని ఆనాడు మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడి చేసిన బ్రిజ్ భూషణ్ ను కఠినంగా శిక్షించకుండా ప్రధాని కి విన్నవించుకోవడానికి వస్తే రెజ్లర్లపై పోలీసుల దాడి చేయించిన ఘటన యావత్ దేశం మొత్తం చూసిందని ఆయన అన్నారు.మణిపూర్ ఘటన కు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments