మణిపూర్ అగంతుకలను శిక్షించాలి
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం!
- మోడీ మౌనం వీడాలి
వేంసూరు,జూలై21(జనవిజయం):
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అగంతుకులను వెంటనే శిక్షించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలోని సీఐటీయూ కార్యాలయం ఎదురుగా గల విజయవాడ ప్రధాన రహదారిపై సీఐటీయూ,సిపిఎం ల ఆధ్వర్యంలో కామ్రేడ్లు నిరసన ప్రదర్శన చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లూరు మాట్లాడుతూ ఘటన జరిగి 77 రోజులు గడుస్తున్న నేటికీ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం,కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మౌనం వీడకుండా వుండటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.మణిపూర్ లో హింసాకాండను పాలకులు పెంచి పోషిస్తూ మత కలహాలు సృష్టిస్తున్నారని,అక్కడి ప్రజలు అభద్రతలోకి నెట్టివేయబడ్డారని యావత్తు భారత్ ను తలదించుకున్నేలా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలని,శాంతి భద్రతలను కాపాడాలని కోరారు.ప్రజా సంఘాలు,ప్రతిపక్ష పార్టీలు,ప్రజాతంత్ర వాదులు స్పందించాలని కోరారు.అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నేతలు సాధు శరత్ బాబు,బోందల యాకోబు,డంకర శ్రీను,తుంగా శేషయ్య,మోదుగు కాంతయ్య,సుహాసిని,గోదా వీర కృష్ణ,సృజన తదితరులు పాల్గొన్నారు.