మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి
- ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
భద్రాచలం, జూలై 21 (జనవిజయం):
మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి,అతి కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేసారు. శుక్రవారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భద్రాచలం లో నిరశన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి జరిగిన ఘటన పై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేసేరు. ఈ కార్యక్రమం లో నాయకులు గుండు శరత్, పూనెం వీరభద్రమ్, పూనెం నాగేశ్వరరావు, గొంది బాలయ్య, పాయం రవివర్మ, జోగారావు, సున్నం గంగ తదితరులు పాల్గొన్నారు. మాలమహానాడు నాయకుడు దాసరి శేఖర్, అలవాల రాజు, చలగుల్ల నాగేశ్వరరావు తదితరులు సంఘీభావం తెలిపారు.