జనవిజయంఅంతర్జాతీయంమందు పంపిణీ ప్రచారాలపై ఆనందయ్య వీడియో సందేశం

మందు పంపిణీ ప్రచారాలపై ఆనందయ్య వీడియో సందేశం

  • ప్రభుత్వం అనుమతిచ్చాకనే మందు తయారీ
  • మందు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్దం
  • వీడియో సందేశం ఇచ్చిన ఆనందయ్య

నెల్లూరు,మే28(జనవిజయం): టీవీల్లో, వాట్సాప్ లో కరోనాకు మందు శుక్రవారం ఇస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారని అవన్ని అబద్దాలని, వాటిని నమ్మొద్దని చెబుతూ ఆనందయ్య ఓ వీడియో పోస్టు చేశారు. మందు తయారు చేయడం నిలిపివేశామని, మందు తయారు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. పర్మిషన్ ఇచ్చిన వెంటనే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాన్నారు. ప్రస్తుతం మందు తయారీకి తనవద్ద వనమూలికలు, ద్రవ్యాలు లేవన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తాను టీవీ ప్రకటన చేసి.. మందు తయారు చేసి అందరికీ సరఫరా చేస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు. ఇదిలావుంటే కృష్ణపట్నంలోని తన నివాసానికి ఆనందయ్య వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ నేతలు కలిశారు. ఆనందయ్య కోసం పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఆనందయ్యను పోలీసులు మరో చోటుకు తీసుకెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆనందయ్య ఇస్తున్న కరోనా మందును ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత ఆనందయ్య కూడా కనిపించుకుండా పోయారు. అయితే ఎమ్మెల్యే గోవర్థన్ రెడ్డి కనుసన్నల్లోనే రహస్య ప్రాంతంలో ఆనందయ్య ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆనందయ్య చుట్టూ పోలీస్ వలయం ఉంది. ఆనందయ్యను కనీసం బంధువులతో కూడా పోలీసులు మాట్లాడనివ్వడం లేదు. కృష్ణపట్నంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి. బయట ప్రాంతాల వారిని పోలీసులు అనుమతించడం లేదు. అయితే ఇంతకుముందు ఆనందయ్య వీడియో ద్వారా ఓ సందేశాన్ని పంపారు. టీవీల్లో, వాట్సాప్ లో కరోనాకు మందు శుక్రవారం ఇస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారని అవన్ని అబద్దాలని, వాటిని నమ్మొద్దని తెలిపారు. మందు తయారు చేయడం నిలిపివేశామని, మందు తయారు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. పర్మిషన్ ఇచ్చిన వెంటనే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి