Friday, March 29, 2024
HomeUncategorizedగిరిజన బిడ్డ వైద్య విద్యార్థి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణానికి కారణమైన సైఫ్ ని...

గిరిజన బిడ్డ వైద్య విద్యార్థి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణానికి కారణమైన సైఫ్ ని తక్షణమే శిక్షించాలని బోనకల్ మండల బీజేపీ ఎస్టీసెల్ అధ్యక్షుడు

బీజేపీ ఎస్టీసెల్ అధ్యక్షుడు బానోతు శ్రీనివాసరావు

 

ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోతు శ్రీనివాసరావు

బోనకల్,ఫిబ్రవరి 27(జనవిజయం):గిరిజన బిడ్డ వైద్య విద్యార్థి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణానికి కారణమైన సైఫ్ ని తక్షణమే శిక్షించాలని బోనకల్ మండల బీజేపీ ఎస్టీసెల్ అధ్యక్షుడు బానోతు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలనందు జూనియర్ వైద్య విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్న డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ ర్యాగింగ్ భూతం వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి గత ఐదు రోజుల నుండి హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ నందు మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి 9:00 గంటల 10 నిమిషాలకు మరణించారనీ ప్రీతి నాయక్ మరణం పట్ల మండల ఎస్టీ సెల్ విచారం వ్యక్తం చేస్తూ,డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణానికి కారణమైనటువంటి సైఫ్ మరియు తోటి వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిర్లక్ష్యం వహించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ ని మరియు యాజమాన్యాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని, ఇలాంటి సంఘటన మరల పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments