వేంసూరు, ఆగస్ట్ 28 (జనవిజయం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తలపెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం అమలు ఎలా ఉందని అధ్యయనం చేసే దానికి వేంసూరు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామం నుండి ప్రారంభించారు.
గ్రామంలోని దళితవాడలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, కురమగూడెంలోని యూపిఎస్ పాఠశాలను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిన్నెర వెంకటరమణ,ప్రధాన కార్యదర్శి నాళ్ళ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పిల్లి జగన్ మోహన్ రావు, కార్యక్రమ ప్రచార కార్యదర్శి అంబోజు నరసింహారావు, ఖమ్మంపాటి మల్లయ్య, మల్లూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.