- జిల్లా మహిళా న్యాయమూర్తి వెంపటి అపర్ణ
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఖమ్మంలో మహిళలు – చట్టాలు సెమినార్
ఖమ్మం,మార్చి 7(జనవిజయం) : ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ చట్టాలను ఉపయోగించుకోవాలని జిల్లా మహిళా న్యాయమూర్తి (జడ్జి) వెంపటి అపర్ణ కోరారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మంచికంటి హాల్ నందు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (tpsk) బోడేపూడి విజ్ఞాన కేంద్రం (bvk), జన విజ్ఞాన వేదిక (jvv), ప్రజా నాట్య మండలి మరియు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా సెమినార్ నిర్వహించారు.
మహిళా సంఘం నేత పి. ఝాన్సీ కుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన అపర్ణ మాట్లాడుతూ నేడు సోషల్ మీడియాలో వస్తున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా పోరాడాలని, వారి మీద కంప్లైంట్ ఇవ్వాలని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వతంత్రత ఉండాలన్నారు. జడ్జీలుగా వున్న మేము కూడా ఇంటి పని చేస్తామని అన్నారు. 24 గం. లు పని చేసేది మహిళ మాత్రమే అన్నారు. మరో అతిధి ఇ. అంజని మాట్లాడుతూ వివాహ అనంతరం మహిళలకు వచ్చే సమస్యల గురించి, వాటి కోసం ఉన్న చట్టాల గురించి వివరించారు. కట్టా రాములమ్మ, మచ్చ లక్ష్మీ, వై.శ్రీనివాసరావు, కళ్యాణం నాగేశ్వరరావు, ఆలవాల నాగేశ్వరరావు, జి. శ్రీదేవి, వి. సదానంద్ మరియు మోహన్, వివిధ సంఘాల నుండి పాల్గొన్నారు. ఈ సెమినార్ లో కె. మల్లిక, వి. సీత, విజయలక్ష్మి, అరుణశ్రీ, పద్మశ్రీ, త్రిపుర, తులశమ్మ, విప్లవ్, శివన్నారాయణ, సామినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.