జనవిజయంసినిమాత్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్

త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్

టాలీవుడ్ లో కొన్ని కాంబినేసన్లకు డిమాండ్  ఉంటుందన్నది తెలిసిందే. ఇటీవల కాలంలో హీరో, దర్శకుడు కాంబినేషన్ పై కూడా ఈ డిమాండ్ ఉండడంతో ఫలానా దర్శకుడితో తమ హీరో నటించాలని, హిట్ కొట్టాలని ఆయా హీరోల అభిమానులు కోరుకుంటుంటారు. ఈ కోవలోకి వచ్చే కాంబినేషన్ మహేష్-త్రివిక్రమ్. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో సినిమాకు సంబంధించిన కబుర్లు హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా ఎంత పెద్ద హిట్టనేది తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ టీ.వీలలో ఎన్నిసార్లు వచ్చినా రేటింగ్ తగ్గకపోవడం బట్టి చూస్తే అతడుని ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారో తెలుస్తోంది. మహేష్ స్టామినాను పెంచిన సినిమా అతడు. ఇదో ట్రెండ్ సెట్టర్ కూడా. అయితే ఆ తరువాత మహేష్ – త్రివిక్రమ్ ల సినిమా ఖలేజా బోల్తా కొట్టింది. సినిమా నిర్మాణ సమయం ఎక్కువ కాలం పట్టడంతో పాటు ఒక్కసారిగి మహేష్ లో ఉన్న హాస్యచతురతని బయటకు తీయడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయకపోయినా తదుపరి టీ.వీలలో మంచి టాక్ తెచ్చుకుంది. మహేష్ బాబు అప్పటిదాక సైలెంట్ డైలాగ్ లతో పాత్రలు చేసి ఉండడం వల్ల ఒకేసారి ఫుల్ కామెడి టచ్ తో మహేష్ లోని ఖలేజాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బయటకు తీయగలిగినా అభిమానులను నిరాశ పరచింది. సినిమాలో మహేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా బాగోలేదు అని చెప్పలేకపోయినా ఎందుకో ఇది ఆశించిన విజయం దక్కించుకోలేదు. ఆ తరువాత మహేష్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సినిమాలు రాలేదు. ఎప్పటికపుడు వాయిదా పడుతూ వస్తున్న మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో 11 సంవత్సరాల అనంతరం మూడో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. కోవిడ్ పరిస్థితులు చక్కదిద్దుకున్నాక షూటింగ్ మొదలవుతోందని టాక్. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సంగీత దర్శకుడిగా ఎవరు ఉంటారనేది చర్చనీయాంశంగా ఉంది. మహేష్ బాబు నటించబోయే ఈ 28వ మూవీకి థమన్ నే ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అల వైకుంఠపురలో హిట్ సాంగ్స్ ఇచ్చి ఆ సినిమా ఘన విజయానికి ప్లస్ పాయింట్ గా నిలచిన థమన్ నే బాబు సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగించాలని దర్శకుడు త్రివిక్రమ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. షూటింగ్ దశలో ఉన్న ప్రస్తుత మహేష్ 27వ సినిమా సర్కారువారి పాట కు కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే మహేష్- త్రివిక్రమ్ ల సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి