Friday, February 23, 2024
Homeవార్తలుఖమ్మం జిల్లాలో 9న హీరో మహేష్ జన్మదిన వేడుకలు

ఖమ్మం జిల్లాలో 9న హీరో మహేష్ జన్మదిన వేడుకలు

  • నేటి నుండి వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు
  • విలేకరుల సమావేశంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రంగారావు

ఖమ్మం, ఆగస్టు 1(జనవిజయం ): ఈనెల 9న సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో హీరో మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజులపాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా గౌరవాధ్యక్షులు తోట రంగారావు అన్నారు.

మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట రంగారావు మాట్లాడుతూ.. గత 40 సం.లుగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

అందులో భాగంగానే ఆగస్టు 9న హీరో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నేటి నుండి వారం రోజులపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 5న బుర్రిపాలెంలో జరుగు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి తమతో పాటు జిల్లా నుండి అభిమానులు పాల్గొనాలని కోరారు.

ఆగస్టు 8న ఖమ్మం వర్తక సంఘ భవనంలో పేద మహిళలకు చీరల పంపిణీ, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ తో పాటు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులకు ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విలేకరుల సమావేశంలో ఖమ్మం నగర అధ్యక్షులు మునగాల బాలు, గౌరవ అధ్యక్షుడు నాగార్జునపు బ్రహ్మం, ఎన్ వెంకన్న, సట్టు సత్యనారాయణ, పెరుమాళ్ళపల్లి వీరబాబు, ఊటుకూరి వెంకటేశ్వరావు, కందుకూరి అశోక్, పులిపాటి సంపత్, బుర్రి మోహన్ రావు, నల్లబల్లి గౌతమ్, మర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments