ఖమ్మం, ఆగస్టు 18(జనవిజయం): బహుజనులు, అణగారిన పేద ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న అని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న 373 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లకారం ట్యాoక్ బండ్ వద్ద గల సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, బహుజనుల, అణగారిన, పేద ప్రజల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడిన వీర పురుషుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. పాపన్న గౌడ్ ఒక గౌడ కులానికే కాకుండా బిసి సామాజిక వర్గానికి, అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. సర్దార్ పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన పోరాట పటిమను పౌరుషాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని మేయర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసి చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, బిచ్చాల తిరుమల రావు గౌడ్, అడ్వకేట్ జేఏసి చైర్మన్ బొలగాని శ్రీనివాసరావు గౌడ్, గోపా రాష్ట్ర బాద్యులు అమరగాని వెంకన్న గౌడ్, గౌడ సంఘం నాయకులు బండి నాగేశ్వరావు గౌడ్, మంద రామారావు గౌడ్, మొక్కుదెబ్బ అధ్యక్షులు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు. శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమాచారీ, నాయకులు పగడాల నాగరాజు, బహుజన నాయకులు తదితరుల కులసంఘ బాద్యులు తదితరులు పాల్గొన్నారు.