జనవిజయంఆరోగ్యంమహాలో ఫలించిన లాక్‌డౌన్‌..!-దిగివస్తున్న కరోనా కేసులు

మహాలో ఫలించిన లాక్‌డౌన్‌..!-దిగివస్తున్న కరోనా కేసులు

ముంబై,మే22(జనవిజయం): రాష్ట్రంపై పంజా విసిరిన కరోనా మహామ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలతోపాటు వారాంతపు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో పరిస్థితుల్లో కొంచెం మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలీకృతం అయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కరోనా రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్‌ పక్రియను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించింది. అయినా, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడంతో, అత్యంత కఠినమైన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను విధించింది. అదే సమయంలో కరోనాను జయించి కోలుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బుధవారం వరకు రాష్ట్రంలో కొత్తగా 34,031 కరోనా కేసులు నమోదవగా.. 51,457 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం కొత్తగా 29,271 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. 47,371 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 54,97,448 మందికి కరోనా సోకగా.. వారిలో 50,26,308 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో గురువారం నాటికి రాష్ట్రంలో కరోనా రికవరీ సంఖ్య అరకోటి దాటినట్లు అయింది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో గణనీయంగా పెరిగిన కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021 మార్చి ఆఖరి వరకు రాష్ట్రంలో 28,12,980 కరోనా కేసులు నమోదవగా.. వారిలో 24,00727 మంది కోలుకున్నారు. సెకండ్‌ వేవ్‌ అనంతరం మే 20వ తేదీ వరకు కరోనా కేసుల సంఖ్య 26,84,468 పెరిగి 54,97,448కి చేరింది. అదేసమయంలో కరోనాతో కోలుకున్నవారి సంఖ్య కూడా 26,25,581 పెరిగి 50,26,308కి చేరింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి