Tuesday, October 3, 2023
HomeUncategorizedమద్యనిషేధ ఉద్యమం మళ్ళీ రావాలి!

మద్యనిషేధ ఉద్యమం మళ్ళీ రావాలి!

తెలంగాణ రాష్ట్రంలో మద్యం నిషేధ ఉద్యమం మళ్ళీరావాలసిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊరికో దూభగుంట రోశమ్మ మళ్ళీ కర్రపట్టి వీదికి రావాల్సిన అవసరం ఉంది. సాధించుకున్న భౌతిక తెలంగాణ కాస్తా మద్యం, మత్తు పదార్థాలలో మునిగితేలుతూ అనైతిక తెలంగాణా కు రూపం ఇస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మద్యం మహమ్మారిని తరిమితే తప్ప తెలంగాణా ఆరోగ్యం కుదుట పడేలా లేదు.

సందట్లో సడేమియా లాగా మన సియం కేసీఆర్ మద్యం వేలం పాటల్ని ముందుచూపుతో ముందస్తుకు నడిపారు. ఫలితం ఎన్నికల తర్వాత రావాల్సిన మద్యం దుకాణాలు వేలం ముందుకు మారింది. ఎన్నికల ముందు పాతమద్యం పాలసీకి అవసరాలు రిత్యా కేసీఆర్ రాబడి రెక్కలు తొడిగారు. ఎట్టకేలకు ఖజానాకు తూలుతూ రూపాయి బిళ్ళ ముందే ఎన్నికల సిందేయ నుంది.

కొన్ని నెలల ముందే మద్యం దుకాణాలు వేలం వేస్తూ తీసుకున్న నిర్ణయం వలన గతం కంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు, 2024పార్లమెంటు ఎన్నికలు, అటుతరువాత స్థానిక సంస్థల ఎన్నికలు వరుస పెట్టి జరగనున్నాయి. ఇక వ్యాపారులకు మద్యం ద్వారా వచ్చే రాబడి కిక్కే వేరు. అందువల్ల పోటీపడి కోకా పేట భూములు వలే ఇంకా కొత్తపధకాలు ప్రకటనలకు, పాతపథకాల సర్దుబాటుకు ఇప్పుడిదే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆర్థిక వనరు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వంకు మద్యం ద్వారా వచ్చిన ఆదాయం 6వేల కోట్లయితే, ఇప్పుడు తొమ్మిదేళ్ళ తర్వాత అది 36వేల కోట్లకు చేరుకుంది. సంక్షేమ పథకాల ద్వారా రైతుబందు, అసరాపెన్షన్లు తదితర సొమ్ములు దొడ్డిదారిన తిరిగి మద్యం ఆదాయం రూపంలో ప్రభుత్వం కు చేరుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి గురించి ఎంతగొప్ప చెప్పుకున్న మద్యం విధానం ప్రజలందరినీ దైనందిన జీవితాలను ఆర్థిక, సాంఘిక, నైతిక పతనం వైపు నడిపించింది.

తెలంగాణా బౌతికంగా వచ్చింది. ఆదాయంపెరిగింది. అదేస్థాయిలో అప్పులు పెరిగాయి. కానీ, నైతికంగా తెలంగాణా పతనం అంచులకు చేరింది. మద్యం ఆరింతలు పెరగడం వలన తెలంగాణా చైతన్యాన్ని అది దెబ్బతీస్తుంది. అధికారికంగా తెలంగాణా సుమారు 2వేల పైచిలుకు మద్యం షాపులుకు వేలం వేస్తున్నారు. కానీ, అనధికారికంగా 60వేల పైచిలుకునే మద్యం షాపులు తెలంగాణ రాష్ట్రంలో యదేచ్చగా ప్రభుత్వం ఛత్ర చాయల్లోనే నడుస్తున్నాయి.

ఇప్పుడు పట్టణాల్లో అనధికారిక షాపులు వీదికి అరడజను వరకు నడుస్తుండగా పల్లెల్లో అయితే, ప్రతికిరాణం దుకాణం, ప్రతిబడ్డి కొట్టు మద్యం అమ్మకం కేంద్రం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. వీటినే బెల్టుషాపులు అనే ముద్దుపేరుతో పిలుస్తున్నారు. లైసెన్స్డుమద్యంషాపులకు నియంత్రిత సమయం ఉంటుందేమో కానీ, ఈ బెల్టుషాపులు మాత్రం అర్థరాత్రి అపరాత్రి తేడాలేకుండా యదేచ్చగా నడుస్తుంటాయి.

ఎక్సైజ్, పోలీసు శాఖలకు పూర్తిగా తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారు. కారణం ఇది వారికి వేతనం కాకుండా మరోఆదాయవనరు కావడమే. ఈ బెల్టుషాపులు వలన మనకెందుకులే అని భావించే వారు ఓసారి మత్తులో జోగుతున్న తెలంగాణా ముఖచిత్రం ఎంతదారుణంగా ఉందో అర్థం కావడంలేదు. ఈ బెల్టుషాపులు మూలంగానే గ్రామీణ పేదలు అనేక నేరాలలో ఇరుక్కుంటున్నారు. 16-17 సంవత్సరాల పనిచేయాలసిన యువత మద్యం షాపులు ముందు తండ్లాడుతున్నారు. మత్తులో జోగు తున్నారు, తాగుతున్నారు. తూగుతున్నారు. అనైతిక, అసాంఘిక చర్యలకు ఉపక్రమిస్తా ఉన్నారు. మద్యంకు బానిసలై లివర్, గుండె సంబంధిత వ్యాధులు బారిన పడుతున్నారు. ఉన్న ఆస్తులు తెగ అమ్మి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థికంగా చితికి కుటుంబాలు చిధ్రం అవుతున్నాయి అనైతిక సంఘటనలకు, అసాధారణ ఘర్షణలకు కారణం అవుతున్నాయి. పట్టుమని 30ఏళ్ళు నిండకుండానే చనిపోతున్నారు.

ఇలాంటి స్థితిలో 30ఏళ్ళకే మహిళలు ఓంటరి మహిళలుగా మారుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో కుటుంబ భారం, బాద్యతలు మీదపడి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు డ్రాఫవుట్ గా మారుతున్నారు. తెలంగాణాలో ఒంటరి మహిళల పెన్షన్ సంఖ్య పెరుగుదల అందుకు ప్రభల సాక్ష్యం గా ఉంది. మద్యం సైలెంటు మరణాలకు గురిచేస్తున్నది.

ఈ మద్యం మహామ్మారికి బలఔతఉన్నదఇలౌతున్నది ముఖ్యంగా యస్సీ, యస్టీ, బిసి, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం. ఇట్లాంటి స్థితిలో బంగారు తెలంగాణ అటుంచి అనైతిక తెలంగాణ మరోవైపు రూపు దిద్దుకుంటుంది. ఒకవైపు అభివృద్ధి గురించి చెబుతున్నా మరోవైపు మద్యం అణగారిన వర్గాల ఎదుగుదలకు శాపంగా మారింది. తొమ్మిదేళ్ళ పాలనలో రాజకీయ నాయకులు, పాలకులు ఆస్థులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.

కానీ, గ్రామీణ పేదల మౌళిక సమస్యలు, క్షుద్బాద కూడా తీరే పరిస్థితి లేదు. అంతా సవ్యంగానే ఉంది. అని ఎవరైనా అంటే అది ఆత్మహత్యాసాదృశ్యమే. మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు వినియోగం తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. దారుణమైన విషయం ఏమంటే కళాశాలలు, పాఠశాలలు వద్దకు గంజాయి నింపిన సిగరెట్లు, నిషేధించబడ్డ గుట్కా ప్యాకెట్లు యదేచ్చగా సరఫరా అవుతున్నాయి. ఈపరిస్థితికి కారణం ఎవరో చెప్పనవసరం లేదు.

నియంత్రించాల్సిన యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహారించడంలో అంతర్యం ఏమిటి? తెలంగాణ భవిష్యత్తును సైతం మత్తులోకి ముంచుతున్న ఈస్థితికి మనం సిగ్గుపడాల్సిన ఉంది. ఈ అనైతిక వాతావరణం ఏఅబివృద్దికి చిహ్నమో?! పాలకులు సెలవివ్వలి. నిదులు, నియమకాలు, నీళ్ళు సంగతి సరే! ముందు తెలంగాణా యువతను మత్తు, మాదక ద్రవ్యాలు చక్రభంధం నుండి బయట పడేయడం ఎలా? అనే ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

ఈదిశగా ఇప్పుడు మనం తెలంగాణా మరో మద్య వ్యతిరేఖ ఉద్యమానికి సన్నద్దం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సైతం పాత మద్యం పాలసీతో షాపులు కేటాయింపుకు సిద్దం అయిన దశలో మద్యం బెల్టుషాపులు గురించి స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. లేదా అదికారికంగా బెల్టుషాపులు ప్రకటించి వేలం వేస్తే కనుక ఒక్కోషాపు లక్ష రూపాయలు ఏడాదికి అమ్మిన 60వేలకోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు మద్యం మీదవచ్చే ఆదాయం కంటే రెట్టింపు. అంటే సగం మద్యం ఆదాయం సిండికేట్ల పేరుతో అనధికార మద్యం అమ్మకాలు పేరుతో అదికారపార్టీ స్థానిక నేతలే పరోక్షంగా లబ్దిపొందుతున్నారు.

తెలఃగాణారాష్ట్రంలో మద్యం అమ్మకాలు పీక్ స్టేజీకి చేరాయనడంలో సందేహాం లేదు. ఈమద్యం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతు కుటుంబాలు, పట్టణం ప్రాంతాల్లో భవననిర్మాణ రంగం కార్మికులు, పారిశ్రామిక కార్మిక కుటుంబాలు, చిరుద్యోగుల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మద్యం విచ్చలవిడిగా అమ్మకాలవలన ఒక అనైతిక సాంస్కృతి తెలంగాణా రాష్ట్రంలో పురుడు పోసుకుంటుంది.

తెలంగాణా అభివృద్ధికి ఆటంకంగా మారింది. కనుక మద్యం ను పాక్షికంగా నిషేదించే వైపుగానైనా పాలకులు ఆలోచన చేయాలి. ప్రజలు కూడా సంపూర్ణ మద్యనిషేధం దిశగా ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణా సమాజం మనుగఢ సాగించలేదు. కనుక విస్తరిస్తున్న మద్యం వ్యాపారం, మధ్యం మహామ్మారిని అడ్డుకునే దిశగా యువజన, మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థలు కృషి చేయాల్సిన సందర్భం ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా మద్యం కేవలం ఆదాయవనరుగా కాకుండా కనీసం పకడ్బందీగా బెల్టుషాపులుపై నిషేధం విధించడం ద్వారా పాక్షికంగా నైనా నిషేదించడం పరిశీలన చేస్తే తప్ప తెలంగాణా సమాజంను మత్తునుండికాపాడే పరిస్థితి లేదు.

యన్.తిర్మల్ , మొబైల్  :9441864514, ఈమెయిల్ ఐడి: thirmal.1960@gmail.com.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments