మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ నియమాకం
ఖమ్మం, మార్చి 04( జనవిజయం):ఖమ్మం జిల్లా కేంద్రంలో మాదిగ హక్కుల దండోరా (ఎం హెచ్ డి) ఎస్సార్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో మూడవ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఆ సభలో వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ జాతీయ అధ్యక్షులు, దండు సురేంద్ర మాదిగ, ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర కమిటీని ఎన్నిక చేశారు .
ఖమ్మం పట్టణ వాస్తవ్యులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగను మాదిగ హక్కుల దండోరా ఎం హెచ్ డి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు . కొరిపల్లి మాట్లాడుతూ.,ఏబిసిడి వర్గీకరణ తక్షణమే చేయాలని, మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,ఎస్సీ లోన 59 ఉప ఉప కులాలకు దళిత బంధు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని , ప్రభుత్వం సంబంధించిన లిడ్ క్యాప్ భూములను కాపాడాలని, నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు . మాదిగ హక్కుల దండోరా మాదిగ హక్కుల సాధన కోసం నిరంతరం పనిచేస్తుందని మాదిగలకు మాదిగ ఉపకులాలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలో మాదిగ హక్కుల దండోరా సంఘాన్ని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ పదవి నా పై నమ్మకంతో నియమించిన వ్యవస్థాపక అధ్యక్షులు యాతకులు భాస్కర్ మాదిగ మరియు జాతీయ అధ్యక్షులు దండు సురేంద్ర మాదిగా కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.