ప్రీతి ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలి!
మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ డిమాండ్
మధిర, ఫిబ్రవరి 27,( జనవిజయం):సోమవారం మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ ప్రీతి కుటుంబానికి న్యాయం చెయ్యాలి అంటే దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు.చనిపోయిన ప్రాణాలకు నష్టపరిహారం చెల్లించి తూతూమంత్రంగా చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాలు, చనిపోయిన వారి పేరు మీద చట్టాలు చేయటం కేంద్ర రాష్ట్రాలకు అలవాటైనదని,గిరిజన విద్యార్థి కావటం వల్లనే ప్రభుత్వం తూతూ మంత్రంగా దోషులపై చర్యలకు ఉపక్రమించటం శోచనీయం అన్నారు. ఇంజనీరింగ్, వైద్య కళాశాలలో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టాలి అని కోరారు. ర్యాగింగ్ కు పాల్పడిన దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేకూరే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాణావతు వెంకటరమణ నాయక్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య మొదలగు వారు పాల్గొన్నారు.