Saturday, September 30, 2023
HomeUncategorizedపేద కుటుంబాలకు కంటి వెలుగు బృహత్తర పథకం

పేద కుటుంబాలకు కంటి వెలుగు బృహత్తర పథకం

జెడ్పీ చైర్మన్ కమల్ రాజు

పేద కుటుంబాలకు కంటి వెలుగు బృహత్తర పథకం

:జెడ్పీ చైర్మన్ కమల్ రాజు:

బోనకల్,ఫిబ్రవరి 27 (జన విజయం): మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సోమవారం రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.

సోమవారం బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు పథకాన్ని గ్రామ సర్పంచ్ జెర్రిపోతుల రవీంద్ర కలిసి ప్రారంభించారు. పేద కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు అమలు చేస్తున్నట్లు తెలిపారు కంటి వెలుగు శిబిరం లో వైద్యులు అందుబాటులో ఉండి పరీక్షలు చేసిన అనంతరం వారికి అవసరమైన కంటి అద్దాలను అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలెవరు కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యం తో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటుగా మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వేలాది కుటుంబాలకు అండగా మారిన బృహత్తర పథకం కంటి వెలుగు అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో పేద కుటుంబాలకు భరోసా కలుగుతుందని స్పష్టం చేశారు.ఈ కంటి వెలుగును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, ఇంచార్జ్ తాసిల్దార్ సంగు శ్వేత ఈఓర్డి సుబ్రహ్మణ్య శాస్త్రి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్ రావు, మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు,మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ వేమూరు ప్రసాద్, సర్పంచ్ జెర్రిపోతుల రవీంద్ర పంచాయతీ కార్యదర్శి కాంపల్లి ఆదాం, సర్పంచులు ఏఎన్ఎం నర్స్ ఆశా కార్యకర్తలు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments