జనవిజయంఆరోగ్యంలోపభూష్టంగా కేంద్ర వ్యాక్సినేషన్ విధానం !

లోపభూష్టంగా కేంద్ర వ్యాక్సినేషన్ విధానం !

దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ తీరుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రాలకు సకాలంలో వ్యాక్సిన్ అందడం లేదు. దీంతో వ్యాక్సిన్ కారణంగా ప్రజల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆప్రతిష్ట పాలవుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలను ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలు కేంద్రంపై దండయాత్ర చేస్తున్నాయి. కేంద్ర విధానాలు రాష్ట్రాలకు శాపంగా మారిందని తెలంగాణ మంత్రులు కెటిఆర్, హరీష్ రావులు విమర్శించారు. అలాగే పలు రాష్ట్రాలు కూడా విమర్శలకు పదను పెడుతున్నాయి. హైదరాబాద్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతున్నా తమకు అందడం లేదని తెలంగాణ పాలకులు విమర్శ చేస్తున్నారు. ఇకపోతే దేశంలో నిరక్షరాన్యులు, ఇంటర్నెట్ అంటే తెలియని వారు ఉన్నారు. వారంతా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవడం సాధ్యమేనా అన్నది కేంద్రం ఆలోచించడం లేదు. నేరుగా గ్రామాలకు వెళ్లి వేక్సిన్ వేస్తే తప్ప మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్ అందదని తేలిపోయింది. ఇకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుందామని గ్లోబల్ టెండర్లు ఆహ్వానించినా కేంద్ర విధానాల వల్ల సాధ్యం కావడం లేదు. దీంతో కనీసం ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని కోరుతున్నారు. ఎపి కూడా గ్లోబల్ టెండర్లు పిలిచినా సాధ్యం కాకపోవడంతో మిన్నకుండి పోయింది. నిజానికి వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం పెద్దగా స్పందన లేకుండా ఉంది. ఆన్ లైన్ లో నమోదు అన్నది భారత్ లాంటి దేశంలో సాధ్యం కాదన్న విషయం గుర్తించడం లేదు. సుప్రీం కోర్టు కూడా దీనిపై ప్రశ్నలు కురిపించినా కేంద్రం నుంచి సమాధానం రావడం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్, ఇతర కారణాల వలన వైరన్ వ్యాప్తి కొంత తగ్గు ముఖం పట్టినప్పటికీ ఇప్పటికే లెక్కలేనంత మందిని వైరన్ ప్రాణాలను బలిగొంది. ఈ సెకండ్ వేవ్ పూర్తిగా ముగియక ముందే ధర్డ్ వేవ్ గురించి చర్చలు, భయాందోళనలు మొదలయ్యాయి. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పలు విధాలుగా ప్రభుత్వాలకు హెచ్చరికలు, సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి బారినుండి బయటపడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

వైద్య నిపుణుల అంచనా ప్రకారం దేశంలో కనీసం 95 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తేనే హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడే అవకాశం లేదని అంటున్నారు. దేశంలో కోవిడ్ అదుపులోకి వచ్చే అవకాశం అప్పుడే వస్తుందని అభిప్రాయపడుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే వైరన్ ఎంతగా వ్యాపించినా పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించిన నివేదికలో జులై చివరకు నెలకు 13కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యేలా చూస్తామని పేర్కొన్నది. వ్యాక్సిన్ డ్రైవ్ వేగాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్న డిమాండ్ దేశంలో పెరుగుతోంది. టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయగల ఇతర సంస్థలు ఉన్నాయి. అవసరమైతే కోవాక్సిన్ మేధోసంపత్తి హక్కులను సవరించి మిగతా సంస్థలు ఉత్పత్తి చేయగల్గేలా చర్యలు తీసుకోవాలని రాజకీయా పార్టీలు, ముఖ్యమంత్రులు కోరుతున్నారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల నేపథ్యం ఉన్న పనేషియా బయోటెక్, ననోఫి-శాంతా బయోటెక్, బయోలాజికల్-ఇ, హెస్టర్ బయోసైన్సెన్, జైడన్ కాడిలా వంటి సంస్ధల్ని భాగస్వాముల్ని చేసి దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థల అన్ని రకాల వ్యాక్సిన్ల మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం సాలీనా 8.2 బిలియన్లుగా ఉన్నది. కనుక కోవిడ్-19 వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తక్షణమే ఈ సంస్థల్ని భాగస్వాముల్ని చేసే చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. విదేశాలనుండి వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించిన బేరసారాల షక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా సాధ్యమైనంత అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాలి. అలాగే విదేశీ వ్యాక్సిన్ సంస్థలు తమ వ్యాక్సిన్లను మన దేశంలోని సంస్థల భాగస్వామ్యంతో ఉత్పత్తి చేసేందుకు జరుపుతున్న సంప్రదింపులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా, నిరాటంకంగా కొనసాగేందుకు స్థానికంగా దేశీయ టీకాల ఉత్పత్తి పెంచడం, విదేశీ వ్యాక్సిన్ల లభ్యత పెంచుకోవడం వంటి చర్యలతో పాటు ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపట్టాల్సి వుంది.

సామాన్య ప్రజలలో వ్యాక్సినేషన్ పట్ల ఉన్న అపోహలు, భయాలు తొలగించి, సంసిద్ధత పెరిగేలా వివిధ పద్ధతులలో అవగాహన కల్గించాలి. వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వమే గ్లోబల్ టెండర్ల ద్వారా కొనుగోలు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు అందిం చాలని ఆయా రాష్ట్రాల సి.ఎంలు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసాలను తొలగించాలని, కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే ధరకు లభ్యమయ్యేలా విధానం రూపొందించాలని తెలంగాణ మంత్రి కెటిఆర్ కోరుతున్నారు. ఇకపోతే వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం సామర్ధ్యం ఉన్న సంస్థలకు అవసరమైనంత బడ్జెట్ ఉదారంగా, సత్వరమే కేటాయించాలి. దేశవ్యాప్తంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలి. సత్వర, సమగ్ర వ్యాక్సినేషన్ పాలసీ అమలు ద్వారా మాత్రమే కోవిడ్-19 కలుగజేసే తదుపరి పరిణామాలను ఎదుర్కొని మహమ్మారికి అడ్డుకట్ట వేయగలమని ప్రపంచ నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. తాజాగా భారత్ బయోటెక్ ఉత్పత్తిని ఇతర సంస్థలకు ఇవ్వాలని దేశంలో డిమాండ్ పెరుగుతోంది. అప్పుడే కోవార్టిన్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని పలు పార్టీల నేతలు కోరుతున్నారు. ఈలోగా వైరన్ మ్యుటేషన్ చెందుతూ మరింత వేగంగా వ్యాపిస్తూ, మరింత తీవ్రత కల్గిన వ్యాధిగా పరిణమించే అవకాశం ఉన్న కోవిడ్-19 మూడవ, నాల్గవ వేలు ప్రజల ముందున్న పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో కేందప్రభుత్వం జోక్యం చేసుకుని స్థానికంగా ఉత్పత్తి చేయబడ్డ వ్యాక్సిన్లు మన దేశ అవసరాలు తీరేదాకా ఎగుమతి చేయకుండా నిషేధించాలి. అయితే కేంద్రం నిర్ణయం మేరకు ఇది ఆధారపడి ఉంటుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి