Saturday, February 24, 2024
Homeరాజకీయంలోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతల ఆసక్తి

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతల ఆసక్తి

  • ఖమ్మంపై కన్నేసిన రేణుకాచౌదరి
  • స్థానిక కార్యక్రమాల్లో బిజీగా నేతలు

ఖమ్మం,ఫిబ్రవరి9(జనవిజయం):

లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో సీట్లు ఆశిస్తున్న నేతలు మెల్లగా తమ స్థానాలను పదిలపర్చుకునే ఎత్తుల్లో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం సీటు కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మాజీకేంద్రమంత్రి రేణుకా చౌదరి మరోమారు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మంలో పాగా వేయాలని బిఆర్‌ఎస్‌ కూడా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ పోటీకి కమలం పార్టీ కూడా రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బహుముఖ పోటీకి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ నుంచి రేణుకా చౌదరి, బిఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎంపి నామా నాగేశ్వర రావు, బిజెపి నుంచి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఈ క్రమంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఖమ్మంలో రాజకీయ వేడి పుడుతోంది. అలాగే కమ్యూనిస్టులు కూడా మళ్లీ రంగంలోకి రావడంతో పొత్తులో భగంగా వారు కూడా సీటును డిమాండ్‌ చేసే పరిస్థితి ఉంది.

అసెంబ్లీ ఫలితాలను విశ్లేషించుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ లోక్‌సభ స్థానాలు దక్కుతాయన్న ఆశలు పెరిగాయి. అయితే ఓడిన ప్రముఖులే పోటీలో ముందుంటున్నారు. దీంతో ఇంతకాలం పోటీ చేయాలని భావిస్తున్న తదుపరి లీడర్లు ఇప్పుడు వీరి నిర్ణయంపై మండిపడుతున్నారు. గత ఫలితాలతో కాంగ్రెస్‌ కు బలం ఉందని తేలింది. బిఆర్‌ఎస్‌ నుంచి పోటీ నామమాత్రం కావడంతో కాంగ్రెస్‌లో గెలుస్తామన్న ధీమాతో పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం లోక్‌సభ స్థానానికి బాగా పోటీ ఉంది. ఇక్కడ రేణుకాచౌదరి మల్లీ బరిలోకి దిగాలని చూస్తున్నారు. అధిష్టానం వద్ద ఆమెకున్న పలుకుబడి, సామాజికవర్గ సవిూకరణాల నేపథ్యంలో ఆమె పోటీకి సై అంటున్నారు. ఖమ్మం లోక్‌సభ సీటుకు ఈసారి గట్టి పోటీ ఉంది.

కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు దక్కించుకున్న పూర్వపు ఖమ్మం జిల్లా టికెట్‌పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మరికొందరు నేతలు దృష్టి సారించారు. పొంగులేటి సుధాకర్‌ రెడ్డి కూడా  ఖమ్మంపై  పట్టుదలగా ఉన్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సర్వేల ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతలు కొందరు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రేణుకా చౌదరి ఇటీవల కొంత క్రియాశీలకంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌ కూడా పట్టుదలతో ఉంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే లక్ష్యంతో పార్టీ కూడా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి విక్రమార్క సతీమణి కూడా బరిలోకి వచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments