జనవిజయంతెలంగాణలాక్ డౌన్ ముగిసే నాటికి 5% కేసులకు మించరాదు

లాక్ డౌన్ ముగిసే నాటికి 5% కేసులకు మించరాదు

మధిర(ఖమ్మం జిల్లా) జూన్ 1 (జనవిజయం) : లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో కోవిడ్ ఉదృతిని అరికట్టగలిగామని, ఖమ్మం జిల్లాలోని గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను మరింత తగ్గించేందుకు వైద్యశాఖతో పాటు అనుబంధ శాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని లాక్ డౌన్ ముగిసే జూన్-9 నాటికి జిల్లాలో 5శాతం కంటే తక్కువగా పాజిటివ్ రేటును తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యస్.యమ్ రిజ్వీ పేర్కొన్నారు. మధిరలోని రెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నియంతణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యాలయపు ఓ.యస్.డి డాక్టర్ గంగాదర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి పి.హెచ్.సిల వైద్యాధికారులు, ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లతో గ్రామ స్థాయిలో చేపడుతున్న చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎం. రిజ్వీ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యుల ఆలోచన మేరకు రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ సత్ఫలితాన్ని ఇచ్చిందని రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. అయితే ప్రస్తుతం గ్రామాలలో కోవిడ్ ఉదృతిని తగ్గించాల్సిన అవసరం ఉందని, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కేసులు అధికంగా ఉన్నాయని, జిల్లాకు ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఉండడం వలన కేసుల సంఖ్యను నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తమ పరిధిలో లక్ష్యాలను నిర్దేశించుకొని సబ్ సెంటర్ ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లతో పాటు గ్రామ పంచాయితీ సిబ్బంది కార్యదర్శి, సర్పంచ్ ల భాగస్వామ్యంతో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. దీనితోపాటు ఇటీవలే నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వేవల్ల కూడా పాజిటివ్ శాతాన్ని నియంత్రించగలిగామని, రోగలక్షణాలు కలిగిన వారికి కోవిడ్ వైద్య కిట్స్ అందించడంతో పాటు వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, ప్రధానంగా గ్రామాలలో పాజిటివ్ పేషెంట్లకు వారి ఇంట్లో ప్రత్యే వసతి లేని యెడల ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని, లేనియెడల కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.

అదేవిధంగా వ్యవసాయ పనులు జరిగేచోట, ధాన్యసేకరణ జరిగే ప్రాంతాలలో జనసమూహం ఎక్కువగా ఉంటుందని ఇటువంటి ప్రాంతాలలో ఆర్.బి.ఎస్.కె వాహనాల ద్వారా టెస్టు నిర్వహించాలని, ప్రధానంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్గించడం ద్వారానే పాజిటివ్ శాతాన్ని పూర్తిగా తగ్గించగల్గుతామని ఆయన తెలిపారు. కోవిడ్ వల్లన ఎట్టి పరిస్థితులలో ప్రాణనష్టం జరగకుండా, కేసుల సీరియస్ కనుగుణంగా సత్వర చర్యలు తీసుకోవాలని, జ్వర సర్వేలో లక్షణాలు కలిగిన వారికి కిట్స్ ఇచ్చిన తదుపరి నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్ ను పరీక్షిస్తూ అవసరమైన యెడల వెంటనేప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్యాధికారులకు సూచించారు. పాజిటివ్ పేషెంట్లు ఇండ్లలో ఉండడంవల్లనే గ్రామాలలో పాజిటివ్ సంఖ్య పెరుగుతుందని, పాజిటివ్ పేషెంట్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆయన సూచించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాస రావు మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి కరోనాను కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆహర్నిశలు పనిచేస్తున్నదని సెకండ్ వేవ్ లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో పాజిటివ్ కేసులు సంఖ్య అధికంగా ఉందని జిల్లా స్థాయిలో అనుబంధ శాఖలు సమన్వయంతో వైరసను కట్టడి చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో అధిక కేసులు నమోదైన సింగరేణి మెడికల్ ఆఫీసర్ ను కారణాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో 786 యాక్టివ్ కేసుల ఉన్నాయని పాజిటివ్ పేషెంట్లను సత్వరమే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని, ఇంటింటి జ్వర సర్వేను మరింత పకడ్బందీగా చేపట్టి రోగ లక్షణాలు కలిగిన వారికి మెడికల్ కిట్స్ అందించడంతో పాటు నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించాలన్నారు. పెద్దగోపతి, మటూరుపేట పి. హెచ్.సి మెడికల్ ఆఫీసర్లతో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కేసుల గురించి అడిగి తెలుసుకొని పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్ళాలని సూచించారు. ఓ.ఎస్.డి డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ ప్రధానంగా కుటుంబంలో పాజిటివ్ శాతాన్ని తగ్గించాలని, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో వ్యాధిగ్రస్తులకు ఎటువంటి కష్టం కలుగకుండా చూడాలన్నారు. కుటుంబంలో ఒకరికి పాజిటివ్ ఉంటె అట్టి పేషెంట్లను వెంటనే ఐసోలేషన్ కు తరలించడం ద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించి పాజిటివ్ రేటును తగ్గించగలిగిందని, గ్రామాలలో కూడా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసి పాజిటివ్ రేటును పూర్తిగా తగ్గించాలని ఆయన అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ ను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా గ్రామాలలో ఉదృతిని అరికట్టేందుకు 10 కేసుల కంటే అధికంగా ఉన్న గ్రామాలలో ప్రత్యేక డిసెంట్రలైజ్డ్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి పాజిటివ్ పేషెంట్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడం జరుగుచున్నదని, జిల్లాలో రెండు విడతలలో ఇంటింటి జ్వర సర్వే పూర్తి చేసుకున్నామని, మూడవ విడత సర్వే ప్రక్రియ జరుగుచున్నదని, జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యంతో ప్రత్యేక కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీనితోపాటు ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామని, జిల్లాలో ఆక్సిజన్, ఇంజక్షన్ల సమస్య లేదని ప్రధానంగా గ్రామాలలో ఉదృతిని తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికతో తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, పి. హెచ్. సిల మెడికల్ ఆఫీసర్లు, ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి