కొత్తగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పంపిణీ
భద్రాచలం, జూలై 21 (జనవిజయం):
లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆద్వర్యంలో వరద బాధితులకు శుక్రవారం ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. భద్రాచలం లోని నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రం లో ఉన్న వరద బాధితులకు తమ వంతు సహాయం గా ఆహారం పంపిణీ చేసినట్లు ముఖ్య అతిధి గా హాజరైన లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ ప్రెసిడెంట్ లయన్ మైనేని మోహనరావు తెలిపారు. సుమారు 500 పులిహోర పొట్లాలు వరద బాధితులకు పంపిణీ చేశారు.
భద్రాచలం మండల అభివృద్ధి కార్యాలయం లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కు కూడా ఆహార పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మందల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు బీక్కులాల్ నాయక్ , నరసింహారావు, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లయన్ షేక్ దస్తగిరి, కార్యదర్శి లగడపాటి రమేష్, కోశాధికారి చెరుకు శ్రీనివాస్ , జిల్లా కేబినెట్ చైర్ పర్సన్ మన్నేం జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.