▪️సెప్టెంబర్ 23 వరకు ప్రతి రోజూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది
▪️నేటి వరకు మొత్తం 795 మందికి లైసెన్స్
▪️LLR లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం,జులై17(జనవిజయం):
డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కు అని, 18ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు విధిగా లైసెన్స్ తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. Vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత లైసెన్సు లో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. ఆన్లైన్ చేసుకున్న వారికి నేడు లెర్నింగ్ లైసెన్స్(LLR) ధృవ పత్రలను సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పత్రలను పంపిణి చేశారు. నేడు 170 మంది LLR కు దరఖాస్తు చేసుకోగా, 347 మందికి మంత్రి పువ్వాడ LLR పత్రలను పంపిణి చేశారు. కాగా నేటి వరకు మొత్తం 795 మంది LLR లైసెన్స్ పొందడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సింది డ్రైవింగ్ లైసెన్స్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఎక్కువ శాతం వాహనాలు నడుపుతున్నారు.. ప్రమాద రహితంగా వాహనాలు నడపాలని సూచించారు. ఇటీవలే కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అనేక సందర్భాల్లో మరణించిన ఘటనల్లో ఇన్సూరెన్స్ క్లైమ్ కాక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. లైసెన్స్ పొందాలంటే చాలా సమయం వేచి ఉండాలనే కారణంతో చాలా మంది తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలా అనేక మంది వివిధ ఘటనలలో అనుకొని ప్రమాదాల్లో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. అలాంటి వారి కోసమే డ్రైవింగ్ లో పలు సూచనలు, సురక్షిత డ్రైవింగ్ కోసం లైసెన్స్ తీసుకుని సురక్షితంగా ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు నేను చేసిన అనేక కార్యక్రమాల్లో యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వగలగటం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, RTO కిషన్ రావు, జిల్లా RTA మెంబర్ వల్లభనేని రామారావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, MVI వరప్రసాద్, కార్పొరేటర్లు దండా జ్యోతి రెడ్డి, పసుమర్తి రాం మోహన్, బత్తుల మురళి, తన్నీరు శోబారాణి, షకీన, రమాదేవి తదితరులు ఉన్నారు.