జనవిజయంవీడియోలుఏమా ప్రశాంత సంగీతం.. సడిసేయకోగాలి.. ఎంత హాయి అయిన సాహిత్యం!

ఏమా ప్రశాంత సంగీతం.. సడిసేయకోగాలి.. ఎంత హాయి అయిన సాహిత్యం!

1960లో విడుదలైన వాహిణీ ప్రొడక్షన్స్ వారి రాజమకుటం సినిమాలోనిదీ గీతం. ఎన్.టి.ఆర్, రాజసులోచన, రాజనాల కనిపిస్తారీ పాటలో. మాస్టర్ వేణు సంగీతం అందించారు. లీల గానం. దర్శకత్వం, నిర్మాత: బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఈపాట ఎన్ని సార్లు విన్నా మనసుకు హాయిగా అనిపిస్తుంది. రణగొనధ్వనులు లేని ప్రశాంత సంగీతం, లీలమ్మ జోలపాట … చాలా బాగుంటుందీ పాట. ఇప్పటి సినిమాలలో ఇలాంటి పాటలు అసాధ్యమేమో.. ఓల్గా వీడియోస్ యూ ట్యూట్ చానల్ వీడియో ఇది.

పల్లవి :

సడిసేయకో గాలి సడిసేయబోకే 2

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే … సడిసేయకే

చరణం 1 :

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి

మణికిరీటము లేని మహరాజు గాకేమి

చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే … సడిసేయకే

చరణం 2 :

ఏటి గలగలలకే ఎగసి లేచేనే

ఆకు కదలికలకే అదరి చూసేనే

నిదుర చెదరిందంటే నేనూరుకోనే … సడిసేయకే

చరణం 3 :

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే

నీడమబ్బుల దాగు నిదుర తేరాదే

విరుల వీవన పూని విసిరిపోరాదే …

సడిసేయకో గాలి సడిసేయబోకే

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే … సడిసేయకోగాలి….. ఆఆఆ….ఊఊఊ…

జనవిజయంలోని అన్ని తెలుగు హిట్ సాంగ్స్ కోసం ఇక్కడ నొక్కండి.

మీకు తెలిసిన తెలుగు హిట్ సాంగ్స్ కోసం మాకు వ్రాయండి : [email protected]

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి