జనవిజయంఆరోగ్యంకరోనా లక్షణాలు లేకుంటే ముందస్తు మందులు వాడొద్దు - కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు

కరోనా లక్షణాలు లేకుంటే ముందస్తు మందులు వాడొద్దు – కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు

న్యూఢిల్లీ, జూన్ 7 (జనవిజయం): కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులను కేంద్ర ఆరోగ్యశాఖ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెన్ (డీజీహెచ్ఎన్) ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ మేరకు కరోనా లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులూ వద్దని స్పష్టం చేసింది. స్వల్ప లక్షణాలు ఉన్నవాళు ఎ యాంటీ పైరెటిక్, యాంటీట్యూనివ్ మందులు మాత్రమే వాడాలని చెప్పింది. ఇన్నాళ్లూ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లకు కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్ మెక్టిన్, డాక్సీనైక్లిన్, జింక్, మల్టీ విటమిన్ల వంటి ట్యాబ్లెట్లు అవసరం లేదని తేల్చి చెప్పింది. జ్వరం కోసం యాంటీపైరెటిక్, జలుబు కోసం యాంటీట్యూసివ్ మందులు మాత్రం వాడితే చాలని తెలిపింది. అవననరంగా పేషెంట్లకు నీటీ స్కాన్లు చేయించొద్దని కూడా డాక్టర్లకు సూచించింది. కొవిడను అడ్డుకోవడానికి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే టెలీకన్సల్టేషన్లు జరపాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించింది. పేషెంట్లు, కుటుంబ సభ్యులు ఫోన్ లో, వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటూ ఉండాలని, సానుకూల విషయాలు చర్చించాలని చెప్పింది. లక్షణాలు లేని వాళ్లకు అసలు ఎలాంటి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లయితే మాత్రం తాము వాడుతున్న మందులను కొనసాగించాలని సూచించింది. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు ఎప్పటికప్పుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ సాచురేషన్ వంటివి చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. దగ్గు ఉంటే ఐదు రోజుల పాటు ఆవిరి కోసం బుడెసొసైడ్ 800 ఎంసీజీ డోసు రోజుకు రెండుసార్లు వాడాలని చెప్పింది. ఇక ఎలాంటి చికిత్స, మందులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపోతే తొలుత కరోనా పేషెంట్లకు ప్లాస్మా కావాలని సూచించా తాజాగా ప్లాస్మా థెరఫినీ పక్కన పెట్టింది. అయితే ఇప్పటికీ కరోనాకు ఓ పద్దతి ప్రకారం అంటే ప్రోటోకాల్ లేదని గుర్తించాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి