జనవిజయంఎడిట్జర్నలిజంజర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

కుటుంబ సభ్యులకూ వేక్సినేషన్ పూర్తి చేయాలి

ఖమ్మం, మే29 (జనవిజయం):జర్నలిస్టులను సూపర్ స్ర్పెడర్స్ గా చూపడం అంటే అవమానించడమేనని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు పల్లా కొండల రావు, వనం నాగయ్య లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాణాలకు తెగించి వృత్తి ధర్మం పాటిస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గానే గుర్తించాలనీ, సూపర్ స్ర్పెడర్స్ అనే పదం సరికాదని తెలిపారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకూ వ్యాక్సిన్ వేయాలని కోరారు. అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా కేమేరామెన్లు, డెస్క్, ప్రింట్ వర్కర్లు వారి కుటుంబ సభ్యులందరికీ వేక్సినేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈమేరకు హెల్త్ డెరైక్టర్ జర్నలిస్టుల కు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

పబ్లిక్ హెల్త్ డెరైక్టర్ ను కలిసిన ఫెడరేషన్ రాష్ట్ర నేతలకు కృతజ్ఞతలు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య గత గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావును కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారనీ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటిన్న ఇబ్బందులపై వివరించినందుకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం నాగయ్య, పల్లా కొండల్ రావు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి జీవో జారీ చేయాలని వారు కోరారనీ, అదేవిధంగా అక్రెడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా గుర్తింపు పొందిన ప్రింట్, ఎలక్ట్రానిక్,వెబ్ మీడియా జర్నలిస్టులందరికీ సంస్థ గుర్తింపు కార్డులపై వ్యాక్సిన్ ఇవ్వాలని, జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ అందించారని ఈ సందర్భంగా వనం నాగయ్య, పల్లా కొండల్ రావు గుర్తుచేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి