జనవిజయంజాతీయండిఎల్‌ఎఫ్‌ ముడుపుల కేసులో లాలూకు ఊరట-క్లీన్‌ చిట్‌ ఇచ్చి సిబిఐ

డిఎల్‌ఎఫ్‌ ముడుపుల కేసులో లాలూకు ఊరట-క్లీన్‌ చిట్‌ ఇచ్చి సిబిఐ

న్యూఢల్లీ,మే22(జనవిజయం): డీఎల్‌ఎఫ్‌ ముడుపుల కేసులో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు జాతీయ విూడియా పేర్కొంది. జాతీయ విూడియా కథనాల ప్రకారం, రెండేళ్ళపాటు జరిగిన దర్యాప్తులో ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలు భించలేదని తెలుస్తోంది. దీంతో ప్రాథమిక దర్యాప్తును ముగించారు. దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష పడటంతో ఆయన మూడేళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి, ఏప్రిల్‌లో బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. సీబీఐ 2018 జనవరిలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపింది. సీబీఐలోని ఆర్థిక నేరాల విభాగం ఈ దర్యాప్తు నిర్వహించింది. ముంబైలోని బాంద్రాలో రైల్వే భూమి లీజును, న్యూఢల్లీలోని రైల్వే స్టేషన్‌ అప్‌గ్రెడేషన్‌ ప్రాజెక్టును పొందడం కోసం డీఎల్‌ఎఫ్‌ లాలూ యాదవ్‌కు దక్షిణ ఢల్లీలో కొంత స్థిరాస్తిని లంచంగా ఇచ్చిందని, అప్పట్లో ఆయన రైల్వే మంత్రిగా ఉండేవారని సీబీఐ ఆరోపించింది. ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే బూటకపు కంపెనీ పేరు విూద దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఆస్తిని 2007 డిసెంబరులో కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. అనేక బూటకపు కంపెనీల ద్వారా డీఎల్‌ఎఫ్‌ హోం డెవలపర్స్‌ ఈ ఆస్తికి నిధులను సమకూర్చినట్లు ఆరోపించింది. నిజానికి అప్పట్లో ఈ ఆస్తి విలువ రూ.30 కోట్లు అని తెలిపింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, 2011లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌, కుమార్తు చంద, రాగిణి ఈ ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కేవలం రూ.4 లక్షలకు కొన్నారు. దీంతో వారు దక్షిణ ఢల్లీలోని ఆస్తికి యజమానులయ్యారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి