Tuesday, October 3, 2023
Homeవార్తలుఖమ్మం లకారంలో మరో అద్భుతం

ఖమ్మం లకారంలో మరో అద్భుతం

ఖమ్మం లకారంలో మరో అద్భుతం

  • వర్షపు నీరు, మురుగుకు శాశ్వత పరిష్కారం
  • మంత్రి పువ్వాడ ప్రత్యేక చొరవతో రూ. 10 కోట్లు మంజూరు
  • ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచే సౌకర్యాలు
  • అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
  • పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

ఖమ్మం జులై 23(జనవిజయం):

ఖమ్మం నగర ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం లకారం ట్యాంక్ బండ్ లో మరో అద్భుతం ఆవిష్కరణ కాబోతోంది.

రెండు లకారం ట్యాంక్ బండ్ ల మధ్య ఉన్న మురుగు కాల్వను శుభ్రం చేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు తొలగించి నగర ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం సుదరీకరణ పనులు చేపట్టారు.

దీర్ఘ కాలంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మంత్రి పువ్వాడ కార్యాచరణ చేపట్టారు. వర్షం నీరుతో నిండి మురుగు గా ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజల కష్టాలను శాశ్వతంగా పారదొలాలని సంకల్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ సమస్యను పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి మంత్రి కేటిఅర్ అందుకు అవసరం అయ్యే రూ.10కోట్ల నిధులు మంజూరు చేశారు.

ఆయా నిధులతో ఖమ్మం లకారం ట్యాంక్ బండ్, మిని లకారం ల మధ్య మూరుగుకు శాశ్వతంగా చెక్ పెట్టనున్నారు. అందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఖమ్మం వైరా రోడ్డు వద్ద గల నాగార్జున ఫంక్షన్ హాల్ నుండి చెరువు బజార్ మజీద్ వరకు రూ .10 కోట్లతో దాదాపు 1.8 కిలోమీటర్ల మేర ఉండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు, వర్షపు నీరు వేరు వేరుగా వెళ్లేందుకు ఆయా కార్యక్రమాన్ని చేపట్టారు.

అనేక సంవత్సరాల నుండి వర్షపు నీరు, మురుగు కలిసిపోయి నిల్వ ఉండడం వల్ల అత్యంత దుర్గంధ భరితంగా మారి ప్రజలు అనారోగ్యం బారిన పడిన ఘటనలు అనేకం. దీనికి మంత్రి పువ్వాడ శాశ్వత పరిష్కారంగా అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ ద్వారా ఈ సమస్యలు చెక్ పెట్టనున్నారు.

అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా వేరు వేరు గా వెళ్లిన మురుగు ప్రకాష్ నగర్ వద్ద గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) కి వెళ్లి అక్కడ శుద్ది చేయబడుతుంది. మరో పైప్ లైన్ ద్వారా వెళ్లిన వర్షపు నీరు నేరుగా మున్నేరు లో కలువనున్నాయి. ఈ ప్రక్రియతో పొల్యూషన్ రహితంగా ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వర్షపు నీరు, మురుగు నిల్వలు లేకుండా శుభ్రపడనున్నయి.

పై భాగంలో ప్రజలకు ఆహ్లాదం పంచే పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఖమ్మం త్రీ టౌన్ లో ఇప్పటికే అద్భుతంగా గోళ్ళపాడు ఛానల్ పై తీర్చిదిద్దిన పార్కులు, ఓపెన్ జిమ్ లు, ప్లాంటేషన్ , వివిధ క్రీడలను ఇక్కడ కూడా ఎర్పాటు చేయనున్నారు.

ఖమ్మం రెండు లకారం ట్యాంక్ బండ్ మధ్యలో కొనసాగుతున్న ఆయా డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం మా బాధ్యత అని, దీర్ఘకాలికంగా అనేక రోగాలకు నెలవైన ఈ మురికి కూపం మారో మూడు నెలల కాలంలోనే అద్భుతంగా అభివృద్ది చేసి సుందరీకరిస్తామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

క్రీడా వసతులు, మినీ పార్క్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, నాయకులు ఆళ్ళ అంజిరెడ్డి, చిరుమామిళ్ళ నాగేశ్వర రావు, జస్వంత్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments