భద్రాచలం, ఆగస్ట్ 30 (జనవిజయం) : దళిత బంధు పథకం కింద లబ్ధిదారులను చిత్త శుద్ధితో, నిజమైన అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎంవి రమణ రావు ను బుధవారం భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా అక్కడ సమావేశమైన పలు దళిత సంఘాల నాయకులు వివిధ మండలాల దళిత సంఘాల నాయకులు దళిత బంధు పథకం నియమావలి గురించి, లబ్ధిదారుల ఎంపిక తీరు గురించి చర్చించారు. అర్హులైన దళిత లబ్ధిదారులకు మాత్రమే దళిత బంధు మంజూ రయేలా చూస్తానని ఈ సందర్భం గా తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘాల నాయకులు చాట్ల రవికుమార్ , రఘు, నాగముత్యం, కర్రీ నాగేశ్వర్ రావు, న్యాయవాది పాపినేని రామహంస, బిఆర్ఎస్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కుమార్, ఎండి నవాబ్ తదితరులు పాల్గొన్నారు.