- మణిపూర్ సీఎం రాజీనామా చేయాలి
- మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- కేవీపీఎస్ జిల్లా ప్రదాన కార్యదర్శి నందిపాటి మనోహర్
ఖమ్మం, జూలై 31(జనవిజయం): మణిపూర్ లో ఆదివాసీ మహిళల అమానవీయ నగ్న ఊరేగింపుకు బాధ్యత వహించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్ చేశారు. మణిపూర్ లో మహిళ నగ్న ఉరేగింపుకు నిరసనగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం న స్థానిక ఎన్నేస్పి క్యాంప్ గేట్ వద్ద మతోన్మాద దిష్టిబొమ్మను దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్లా సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మనోహర్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం కుకి ఆదివాసి గిరిజనులపైన అక్కడి అగ్రవర్ణ మైతీలను ఉసిగొల్పి ఈ అఘాయిత్యాయినికి పాల్పడ్డారని వారు దుయ్యట్టారు. మణిపూర్ ప్రజలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలకు దేశం తో పాటు ప్రపంచం తీవ్రంగా ఖండించిందన్నారు, దీనికి బాధ్యత వహించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గత 3 మాసాలుగా ఎందుకు మౌనంగా ఉన్నారో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు బిజెపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలని అమలు చేయడం కోసం బిజెపి ఎంతకైనా తెగిస్తుందనే దానికి నిదర్శనమే ఈ మణిపూర్ ఘటనలని వారు విమర్శించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, టర్కీ భూకంపం, గుజరాత్ వరదలు వాటిపై స్పందించిన మోడీ మణిపూర్ ఘటనపై ఎందుకు స్పందించలేదని విమర్శించారు. ఈ ఘటనలు ఆపివేయకపోతే రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ పెరిగితే మరిన్ని మణిపూర్ లు అవుతాయని చెప్పారు. మణిపూర్ ఘటనపై ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు బొట్ల సాగర్, కుక్కల సైదులు, నగర నాయకులు గుమ్మడి భిక్షం, సి.హెచ్. వీరభద్రం, గొర్రేముచ్చు శాంతయ్య, జెర్రిపోతుల కిరణ్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.