- దళితుల సమస్యల సాధనకై ఈ నెల 11న ఖమ్మంలో కెవిపిఎస్ జిల్లా వర్క్ షాప్
- కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపు
ఖమ్మం,మార్చి8(జనవిజయం): కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఖమ్మం జిల్లా వర్క్ షాప్ ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు ఖమ్మంలోనీ మంచికంటి ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నట్లు, ఈ వర్క్ షాప్ కి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు హాజరుకానునట్లు కేవీపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్నెఎస్పి క్యాంపు లోని సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ సమాజంలో కుల వివక్ష దాడులు కొనసాగడం అత్యంత విచారకరమని వారు పేర్కొన్నారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన కొరకు మహనీయుల స్ఫూర్తితో రానున్న కాలంలో పెద్ద ఎత్తున సామాజిక పోరాటాలు నిర్వహించుటకై భవిష్యత్ కార్యచరణను రూపొందించుటకై ఖమ్మంలో ఈ నెల 11న జరుగుతున్న జిల్లా వర్క్ షాప్ కు జిల్లాలోని అన్ని మండలాల నుండి సామాజిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, పాపిట్ల సత్యనారాయణ, బొట్ల సాగర్, కొమ్ము శ్రీను, నకరికంటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.