జనవిజయంసాహిత్యంకుడి ఎడమల ఉండలేమా? కష్టజీవికి అండ కాలేమా?

కుడి ఎడమల ఉండలేమా? కష్టజీవికి అండ కాలేమా?

వారం వారం….  నా’మా’ట ఈవారం ప్రారంభం

క్తరామదాసు కళాక్షేత్రం ఆడిటోరియం నిండిపోయింది. వేదికపై అంతా తలపండిన వారే ఉన్నారు. అందరూ అనర్గళంగా మాట్లాడుతున్నారు. చివరకు సన్మాన గ్రహీత వంతు వచ్చింది. మైక్ అందుకుని ప్రసంగించడం ప్రారంభించారు.

‘మీరంతా నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. జిల్లాకు ఖ్యాతిని తెచ్చానని కొనియాడారు. అందరికీ ధన్యవాదాలు. నాకు మాత్రం బాధగా ఉంది. నా బాధ కొంతయినా తీరుతుందనే ఉద్దేశ్యంతో నాకిచ్చిన అవార్డును ఓ రిక్షా కార్మికుడి అంకితం ఇస్తున్నానని’ ప్రకటించాడు. కొంతసేపు సభలో నిశ్శబ్దం. అనంతరం చప్పట్లు మారుమోగాయి. వెంటనే తను అనుకున్న రిక్షా కార్మికుడిని వేదికపైకి పిలిపించి అవార్డును అంకితం చేశాడు. సభ ముగిసింది. అందరూ వెళ్లిపోతున్నారు. నాకు మాత్రం ఏదో వెలితిగా ఉందని పించింది. రిక్షా కార్మికుడికి అవార్డు అంకితం ఇవ్వడం వల్ల సన్మాన గ్రహీత గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఫర్వాలేదు. ఎందుకు అంకితమిచ్చాడన్నది చెప్పనేలేదు. దీనిని తెలుసుకోవడం ఎలాగా అంటూ బుర్రకు పదును పెట్టాను. ఆయననే అడుగుదామంటే జనం మధ్య సెక్యూరిటీ నీడలో గభగభా వెళ్లిపోయాడు. నా సందేహం తీరేదెలా..

మరుసటి రోజు అతని ఫోన్ నెంబర్ సంపాదించి నా సందేహాన్ని అడిగాను. అతను చెప్పుకుంటూ పోతున్నాడు.

నేను ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను. నాకు లోటేమీ లేదు. ఓ రోజు రోడ్డుపై వెళ్తుంటే ఆ రిక్షా కార్మికుడు కనబడ్డాడు. రిక్షాపై ఎంతో బరువైన సామాన్లు వేసుకుని వెళ్తున్నాడు. పెద్ద ఒడ్డు తగిలింది. రిక్షా తొక్కలేక పోతున్నాడు. రిక్షా కిందికి జరుగుతుంటే వెంటనే దిగి పట్టుకున్నాడు. నెట్టుకుంటూ నడిపిస్తున్నాడు. ఎంతో ఎత్తయిన ప్రదేశం కావడంతో రిక్షా అతికష్టంగా ముందుకు కదులుతోంది. అలా పావు గంట పాట శ్రమించి ఒడ్డు ఎక్కి వెళ్లిపోయాడు. ఆ రోడ్డుపై చాలా మంది వెళ్తున్నారు. పోతున్నారు. ఒక్కరూ కూడా సహాయం చేయలేదు. ఆ దృశ్యాన్ని అంతా చూస్తూనే ఉన్నాను కానీ అతనికి సాయపడలేకపోయాను. అసలు సాయం చేద్దామనే ఆలోచనే రాలేదు. ఎంతసేపూ రిక్షాను ఎంత సేపటిలో తీసుకెళ్తాడు, అసలు ఒడ్డు చేరుకుంటాడా లేదా, ఎవరి సాయాన్నయినా తీసుకుంటాడా లేదా… ఇవే ఆలోచనలతో ఉన్నాను. కానీ సాయం చేయాలనే ఆలోచనే రాలేదు. ఆ దృశ్యాన్ని ఊహించుకుని కవిత్వం రాయడం ఆరంభించాను. గొప్ప అవార్డును పొందగలిగాను. ఆయనింకా రిక్షా తొక్కుతూనే ఉన్నాడు. ఇక్కడి సభకు టెంట్ సామాను వేసుకుని వచ్చాడు. అతనే నాకు స్ఫూర్తి. ఎంత కవిత్వం రాసినా, ఆ బాధను వర్ణించినా తృప్తి కలగలేదు. ఆయన బాధను వర్ణించాను కాని ఆ బాధను నేను పడలేదు కదా. అందుకే చిన్న సంతృప్తి కోసం నాకు స్పూర్తి గా నిలిచిన ఆ రిక్షా కార్మికుడికి అవార్డును అంకితమిచ్చాను అంటూ తనలోని ఆర్ద్రతను దింపేసుకున్నాడు.

ప్రజల బాధను తన సహానుభూతిగా మార్చుకుంటేనే గొప్ప కవి అవుతాడన్న ఓ మహానుభావుని మాటలు నా చెవుల్లో ధ్వనించాయి. సాహిత్యానికి సమాజాన్ని మార్చగల శక్తి ఉందని అందరూ చెబుతుంటారు. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకూ ఎంతో గొప్ప సాహిత్యం వచ్చింది. మరి సమాజం మారిందా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. ఆయా సమాజ స్థితిగతులను బట్టి సాహిత్యం వచ్చిందనేది ప్రస్ఫుటం. కాలాలు మారుతున్న క్రమంలో సాహిత్యంలోనూ పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.

బతకడానికి నాలుగు మాటలు చెప్పిన రోజుల నుండి తమ బతుకులకు నీవెందుకు దిక్కంటూ రాజ్యాన్ని ప్రశ్నించే స్థాయి దాకా సాహిత్యం వచ్చిందనడంలో సందేహం లేదు. ప్రాచీన కాలంలోనూ రాజుల అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకించిన కవులూ లేకపోలేదు. అది తదనంతరం కాలంలో పెరుగుతూ వచ్చింది. శాసించే స్థాయికి వచ్చినప్పుడే పాలకుల నుండి మంచి పాలనను ఆశించవచ్చు. ఇప్పుడు కవులంతా అలా ఉన్నారా.. రాజ్యధిక్కరణలో పాలు పంచుకుంటున్నారా అంటే.. ఉండొచ్చు. ఉండకపోవచ్చు. అది కవి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీశ్రీ కవితను గుర్తు చేసుకోవాలి.

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు –
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె..

పై కవితా ఫంక్తుల్లో మనిషి వ్యక్తిత్వ వ్యవస్థ ఉంది. మనం ఎటు ఉండాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. నీవు నేను కలిస్తేనే సమాజం. మనందరం బాగుంటేనే సమాజం బాగున్నట్టు. మరి మనం బాగున్నాసమాజం ఇంకా ఎందుకు బాగోలేదనిపిస్తోంది. కారణం అందరికీ తెలుసు. కారణంపై తిరగబడానికి అంతా సన్నద్దంకారు. అందుకే అటు పాలకులు, ఇటు పాలితులు… ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. మరి కవులుగా మనం చేస్తున్నట్టు. ఇక్కడ ప్రశ్న ఉద్భవించకపోతే మనం కవులమేనా.. అన్నది ధర్మసందేహం.

అస్తమానం ‘నేను’ అనేది గానుగలా తిరుగుతుంటే  ఒక్కొక్క అర ఓ లోకమె నీల్గుతుంటే.. సమిష్టిదృష్టికి అడుగడుగునా ఉరికంబమే ఇరుకుగుణం హరిత జీవితాన్ని ఎదగనీయదు..  అంటారు సినారె. ఆ మాటల్లోని సారాంశాన్ని వంటిపట్టించకుంటేనే మనం సంఘజీవులం అవుతాము. సంఘజీవులే కష్టజీవులు. కష్టజీవులకు అటు ఇటూ ఉండేవారే కవులు.

ఉన్నదాని ఉన్నవాళ్లందరితో పంచి
ఉన్నంతలో అందరం కలిసి భోంచేసి
ఉజ్జ్వలంగా ఆటల్లో పాటల్లో పడి
ఊరంతా తిరగడం ఎంత బాగుంటుంది?..

దాశరథి ముందుచూపుకు తార్కాణం పై నాలుగు ఫంక్తులు. అవి మన కలాలపై ఎల్లప్పుడూ నాట్యంచేయాలని కోరుకుందాం.

ఇంతకూ
ఏం చెప్పదలుచుకున్నాడు. ఏం చెప్పాడు అనేది పక్కనబెట్టి ఇందులోని సారాంశాన్ని వంటపట్టించుకుందాం. మరో అంశంపై మళ్లీ కలుద్దాం.

-నామా పురుషోత్తం
98666 45218

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి