కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు విజయవంతం చేయండి
- నియోజకవర్గ స్థాయి భారీ మోటార్ బైక్ ర్యాలీ, రక్తదాన శిబిరం
- బిఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం
కారేపల్లి, జూలై23(జనవిజయం):
తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించే నియోజవర్గ స్థాయి బైక్ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశానుసారం కారేపల్లి నుండి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పోట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగే బైక్ ర్యాలీ, రక్తదాన శిబిరం, అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమానికి మండలం నుండి ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, నాయకులు ముత్యాల సత్యనారాయణ, తోటకూరి పిచ్చయ్య, తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, అడపా పుల్లారావు, శివరాత్రి ఆచ్చయ్య, బత్తుల శ్రీనివాస్, మండల లీగల్ సేల్ కన్వీనర్ నర్సింగ్ శ్రీనివాస్, మండల రైతు బంధు కన్వీనర్ ఈశాల నాగేశ్వరరావు, సొసైటీ వైస్ చైర్మన్ ధరావత్ మంగీలాల్, వెంకటేశ్వర దేవాలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ధారవత్ పాండ్య నాయక్, బాణోత్ రమేష్, మూడ్ జ్యోతి, కో ఆప్షన్ ఎండి హనీఫ్, స్సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూక్య రంగారావు, బాణోత్ కుమార్, ఆదినారాయణ, గుగులోత్ పద్మ, గుగులోత్ సకృ, ధర్మసోత్ మౌనిక, కురసం సత్యనారాయణ, బాణోత్ సంధ్య రాందాస్, బాణోత్ పద్మ మోహన్, బాణోత్ మారు సకృ, భూక్య విజయ నాగేశ్వరరావు, జర్పుల హచ్చు శాంతి, సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్, మహిళ అధ్యక్షరాలు బాణోత్ పద్మావతి, ఉపసర్పంచ్ భూక్య చాందిని, నాయకులు సుడిగాలి బిక్షమయ్య, నాగండ్ల సీతయ్య, నాలబాల మల్లయ్య, యువజన నాయకులు భూక్య రాంకిషోర్ నాయక్, ఎర్రబెల్లి రఘు, బాణోత్ కోటి, బానోతు వీరన్న చక్రం, నాగేంద్ర బాబు, బిందె రమేష్, షఫీ, రామారావు, తొగరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.