వేంసూరు, ఆగస్ట్12 (జనవిజయం): మండల పరిధిలోని వెన్నచ్చేడు వెంకటాపురం గ్రామానికి చెందిన తెల్లగొర్ల వెంకటేశు, సీతమ్మ దంపతుల కుమారుడు సత్తుపల్లి జె. వి. ఆర్ ప్రభుత్వ డిగ్రి కాలేజిలో కామర్స్ అధ్యాపకునిగా పనిచేస్తున్న తెల్లగొర్ల కృష్ణారావు కామర్స్ సబ్జెక్టు లో “ది ఆఫ్టిమాలిటి ఆఫ్ కాపిటల్ స్ట్రక్చర్ టెక్నిక్స్ ఇన్ బి ఎస్ ఇ ఎంటర్ ప్రైజెస్” అనే అంశంపై ప్రొపిసర్ డాక్టర్ వికాష్ కుమార్ పర్యావేక్షణలో చేసిన పరిశోదనకు గాను శ్రీ కృష్ణా యూనివర్సిటీ మధ్యప్రదేశ్ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇతని అభ్యాసం ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు వేంసూరు మండలం వెన్నచ్చేడు వెంకటాపురం గవర్నమెంట్ స్కూల్లో,ఇంటర్ SBS గవర్నమెంట్ కాలేజి, డిగ్రి JVR ప్రభుత్వ డిగ్రి కాలేజి, PG కాకతీయ యూనివర్సిటి వరంగల్ , M. Phil శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటి తిరుపతిలో విద్యాభ్యాసం చేశారు,తల్లి తండ్రులు వెన్నచెడు వెంకటాపురంలో గొర్రెల కాపరులు కడు నిరుపేద కుటుంబంలో పుట్టి మారుమూల గ్రామమం నుండి వచ్చి ఈరోజు శ్రీ కృష్ణ యూనివర్సిటి మధ్య ప్రదేశ్ డాక్టరేట్ పొందినందుకు JVR డిగ్రి కాలేజ్ ప్రిన్సిపాల్ &స్టాఫ్ మరియి వెన్నచెడు వెంకటాపురం ప్రజలు అభినందనలు తెలియ జేసారు .