జనవిజయంఆంధ్రప్రదేశ్కృష్ణపట్నం రావద్దంటున్న నెల్లూరు కలెక్టర్

కృష్ణపట్నం రావద్దంటున్న నెల్లూరు కలెక్టర్

  • త్వరలోనే ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య మందు

నెల్లూరు, జూన్ 1(జనవిజయం): కృష్ణపట్నం ఆనందయ్య మందులను ఆన్ లైన్ ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆనందయ్య మందు దేశవ్యాపితంగా పాపులర్ కావడంతో ఈయన మందుకు డిమాండ్ ఏర్పడింది. ఎట్టకేలకు రాష్ట్రప్రభుత్వం సాంప్రదాయ వైద్యం క్రింద ఆనందయ్య మందును ప్రజలు తమ కోరిక మేరకు తీసుకోవచ్చని అనుమతించింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో ఆన్ లైన్ ద్వారా పంపిణీ ప్రారంభిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఆనందయ్య ఇచ్చే మందుల కోసం వివిధ ప్రాంతాలనుండి జనం భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడం.. మరో వైపు కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఇబ్బందులు నివారించేందుకు ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పంపిణీ చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. ఈ షరతును అమలు చేయడం కృష్ణపట్నంలో అసాధ్యంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో జనం ఎగబడి వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడం.. చాలా కష్టతరం అని గతంలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆనందయ్య మందుల పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండడం.. మరో వైపు ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తూనే కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయాలని చెప్పడంతో ఆనందయ్య మందుల తయారీ కూడా సవాల్ గా మారింది. జనం భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కార్లలో బయలుదేరి వస్తామని ప్రతిరోజు గ్రామస్తులకు వందల సంఖ్యలో ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ఈ నేపధ్యంలో మధ్య మార్గంగా ఆన్ లైన్ ద్వారా పంపిణీకి నెల్లూరు జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. మందుల తయారీ.. పంపిణీ విషయాలపై ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమావేశమై చర్చించారు. కరోనా నిబంధనలు పాటించడం.. రద్దీని నివారించే అంశాలపైనే చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామన్నారు. త్వరలో ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మందు తయారీకి కొన్ని రోజులు సమయం పడుతుందని… జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మందు కోసం ఎవరూ రావొద్దని చక్రధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి