భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 03 (జనవిజయం): ఖమ్మం నుండి బదిలీ పై వచ్చిన జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (డి వై ఎస్ ఓ) ఎం.పరంధామ రెడ్డి ని భద్రాద్రి కొత్తగుడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సన్మానించారు. కలెక్టరేట్ కార్యాలయం లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం సందర్బముగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె .మహిధర్ మాట్లడుతూ పరంధామ రెడ్డి ఖమ్మం జిల్లా లో పనిచేసినప్పుడు క్రీడల అభివృద్ధి కి బాగా కృషి చేసినట్లు తెలిపారు. స్టేడియంల నిర్మాణాలు కూడా చేపట్టారని అన్నారు. అదే స్ఫూర్త్తి తో భద్రాద్రి జిల్లా లో కూడా స్టేడియం నిర్మాణాలు, క్రీడల అభివృద్ధి కి కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి రాసపల్లి రాజేంద్ర ప్రసాద్ మాట్లడుతూ డివైఎస్ఓ మంచి సమయం లో జిల్లా కు పూర్తి స్థాయి క్రీడల అధికారి గా రావటం సంతోష కరమని అన్నారు. జిల్లా లోని క్రీడా అసోసియేషన్ కు, క్రీడాకారులకు చాల ఉపయోగం గా ఉంటుందని అన్నారు. ఈ సందర్బముగా శ్రీ పరంధామ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జిల్లా లొని అన్ని క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. క్రీడాకారుల కావలసిన సదుపాయల గురించి కలెక్టరు విన్నవిస్తానని తెలిపారు .ఈ కార్యక్రమము లో ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బరిగెల భూపేష్ ,జిల్లా యోగ కార్యదర్శి గుమ్లాపురం సత్యనారాయణ ,జిల్లా అథ్లెటిక్స్ సంయుక్త కార్యదర్శి పాము నాగేందర్ ,జాతీయ అథ్లెట్ గుమ్మడి సాగర్ తదితరులు పాల్గొన్నారు.