- కోతులను బంధిస్తున్న చెన్నై ముఠా సభ్యులు
బోనకల్,జులై 19 (జనవిజయం):
బోనకల్ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణం కొనసాగించే రైల్వే ప్రయాణికులకు, రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముండే స్థానికులకు కోతుల బెడద వీడనుంది. రైల్వే స్టేషన్ లో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రయాణం కొనసాగించే ప్రయాణికుల పై దాడిచేయడం, రైల్వే స్టేషన్లలో ఉన్న సామగ్రిని ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో చెన్నై నుండి వచ్చిన కోతులను బందించే ముఠా సభ్యులు ప్రత్యేకంగా బోనులను ఏర్పాటు చేసి కోతులను బంధిస్తున్నారు. దీంతో కోతులు బెడద వీడనుందని రైల్వే ప్రయాణికులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.