జనవిజయంఆంధ్రప్రదేశ్కొత్త మ్యుటేషన్లకు అప్రమత్తతే మందు

కొత్త మ్యుటేషన్లకు అప్రమత్తతే మందు

రోనా తగ్గిందని ప్రభుత్వాలు చెబుతున్నా అనధికార మరణాలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. బీహార్ ఘటననే తీసుకుంటే మరణాల సంఖ్యను దాచిపెట్టడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. బీహార్ లెక్కలు రావడంతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో లెక్కలు మారాయి. ఓ వైపు కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం అంటోంది. మరోవైపు రోజు రోజుకూ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాలూ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఎవరివల్ల కరోనా సోకు తుందో తెలియడం లేదు. ఇంత కాలం కరోనా వస్తే ఎవరి ద్వారా వచ్చిందో కాంటాక్ట్ ను పట్టుకునే ప్రయత్నం జరిగేది. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో జనసంచారం పెరగడంతో ఎవరికి కరోనా ఉందో లేదో తెలియని దుస్థితి ఏర్పడింది.

మరోవైపు ప్రాణాంతక కరోనా వైరన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇకపోతే మ్యుటేషన్లు ఎన్ని వచ్చినా అప్రమత్తంగా ఉంటే ఏమి చేయలేవని అంటున్నారు. అలాగే వైరస్ వ్యాప్తి నిరోధంలో ఆంక్షలతో కూడిన కట్టడి మంచి ఫలితమిచ్చిన మాట వాస్తవమే! అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమూ పడింది. దేశప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో.. ప్రాణాధారమైన ఉద్యోగ, ఉపాధి పనులపై దెబ్బపడి, ఉత్పత్తి, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థ ఛిద్రమవడం కూడా మనకే నష్టం. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ, వైరన్ కట్టడి ద్వారా అటు ప్రజల ప్రాణాల్ని కాపాడాలి. కట్టడిని సడలించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించి సమాజ మనుగడనూ కాపాడాలి. వీటి మధ్య సమతూకం సాధించాలి. అవసరమైన పటిష్ట ప్రజా వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. టీకాల పక్రియను వేగవంతం చేయాలి. వైరన్ ఏ వైవిధ్య రూపంలో వచ్చినా, మరే వేరియంట్ ఉధృతితో తోసుకు వచ్చినా సమర్థంగా ఎదుర్కోగల స్థితి తీసుకునిరావాలి. తగిన సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా పాజిటివిటీ అదుపు చేయాలి. మరణాల నియంత్రణ, కోలుకుంటున్న వారి సంఖ్యలోనూ వృద్ధి సాధించాలి.

ఈ క్రమంలో చేపట్టే చర్యలకు పౌరసమాజం నిర్మాణాత్మక సహకారం అందించాలి. అప్పుడే ఈ విపత్తు నుంచి దేశం బయటపడగలదు. కొత్త వేరియంట్, థర్డ్ వేవ్ అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో దాని తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని వైద్య అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. నిజానికి ఇక్కడ ప్రజలు మాత్రమే అప్రమత్తంగ ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు సాగాలనే ప్రభుత్వాలు క్రమంగాలాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ నిత్య కార్యకలాపాలు సాగించాలి. వైరన్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలిస్తూ ఉండడంతో వైరన్ కూడా విస్తరిస్తోంది. అయితే కరోనా బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి తొలిసారిగా చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న రోగుల సంఖ్య పెరిగింది. కరోనా విలయ తాండవంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వార్త కొంత ఉపశమనాన్నిస్తున్నది. వైరన్ నుంచి రోజు రోజుకు కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అధిక కేసుల నమోదుతో భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటాయేమోనని ఆందోళనకు గురవుతున్న ప్రజలకు తాజాగా కోలుకుంటున్న గోగుల గణాంకాలు భవితవ్యంపై ఆశలు రేకెత్తిస్తున్నాయన్నారు. అయితే లాక్ డఔన్ సడలింపులతో మళ్లీ సాధారణ స్థాయిలోప్రజల కార్యకలాపాలు మొదలయ్యాయి.

ప్రజలు రక్షణ చర్యలను పెద్దగా పట్టించు కోవడం లేదు. దీంతో కూరగాయలు, పళ్లు, పూలు, మాంసాహారం అమ్మే వారి నుంచి సోతుకుందన్న అనుమానాలు ఉన్నాయి. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే సామాన్యులకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. దీంతో ఏ మూలనుంచి కరోనా పొంచి ఉందో గుర్తించడం కష్టంగా మారింది. ఒక వ్యక్తికి వైరన్ సోకితే, అతను ఆ వైరన్ నుంచి కోలుకునేందుకు రెండు వారాల సమయం పడుతుంది. ఆ సమయంలో అతను కనీసం పది మంది వరకు వైరన్ ను అంటిస్తారని, ఆ రకంగా ప్రస్తుత పరిస్థితి ఆధారంగా అంచనా వేస్తున్నారు. దేశంలో మాత్రం ప్రస్తుతం వైరస్ సంక్రమణ జరుగుతోందని, కానీ అది సామూహిక వ్యాప్తా? కాదా? అన్న విషయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వమే తేల్చాల్సి ఉంటుంది. లాక్ డౌన్ నిబంధనలు వున్నా ప్రభుత్వాలిచ్చిన వెసులుబాట్లు ఆసరా చేసుకుని దైనందిన కార్యకలాపాలు మునుపటిలాగే మొదలయ్యాయి.

ఇంకా వ్యాపార, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు మందకొడిగానే వున్నా..పౌరుల కదలికలు మాత్రం ఆగడం లేదు. చాలా చోట్ల భౌతిక దూరం పాటించడంలో శ్రద్ధ తగ్గింది. ప్రభుత్వాలే ఇందుకు కారణం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో యధాప్రకారం జనం చాలా దగ్గరగా మసులుతున్నా క్రమబద్ధీకరించడం కనబడడం లేదు. ప్రభుత్వాలు వెసులుబాట్లు ఇచ్చాయి గనుక కరోనా కేసుల సంఖ్య పెరగొచ్చునని ముందు అనుకున్నట్లే ఆ ప్రమాదం ముంచుకొస్తోంది. పర్యావరణానికి హాని చేకూర్చే విధానాలకు స్వస్తి చెప్పడం, ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు మానుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమియడం ప్రస్తుత అవసరం. ప్రజల అప్రమత్తతను బట్టి వ్యాప్తిని నిరోధించవచ్చని అంటున్నారు. ఎన్ని మ్యుటేషన్లు వచ్చినా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఏమి కాదని కూడా భరోసా ఇస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి