– జెండా ఆవిష్కరించిన డిపిఆర్ఓ శీలం శ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 15 (జనవిజయం): దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది త్యాగదనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఈ దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సాధించి పెట్టారని, అటువంటి మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని కొత్తగూడెం డి పి ఆర్ ఓ శీలం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ లో డిపిఆర్ఓ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర భారతావనిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ, సమాజంలో ఉన్నతంగా జీవించేందుకు అవకాశం కల్పించారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని డిపిఆర్ఓ సూచించారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడంలో శాయశక్తులా కృషి చేస్తానని, జర్నలిస్టులు ఐక్యంగా ఉండి సమాజ హితం కోసం పని చేయాలని డిపిఆర్ఓ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు, కల్లోజి శ్రీనివాస్, ఇమంది ఉదయ్ కుమార్, షఫీ, వట్టి కొండ రవి, డి రామారావు, సీనియర్ జర్నలిస్టులు మోటమర్రి రామకృష్ణ, సబ్బతి శివమూర్తి, సీమకుర్తి రామకృష్ణ, ఎర్ర ఈశ్వర్, లక్ష్మణ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.