జనవిజయంఆంధ్రప్రదేశ్కొత్త రేషన్ కార్డులతో మరింత దుబారా

కొత్త రేషన్ కార్డులతో మరింత దుబారా

  • రేషన్ బియ్యంతో సరిహద్దు వ్యాపారం
  • రూపాయి బియ్యం కోసం దళారీల చూపు

నిజామాబాద్,జూన్ 9 (జనవిజయం): తెలంగాణ జిల్లాల్లో అధిక సంఖ్యలో రేషన్ కార్డులు ఉన్నాయి. జనాభాకు సరిపడా రేషన్ కార్డులు ఉన్నాట్లు విమర్శలు కూడా ఉన్నాయి. అయినా మళ్లీ కొత్తగా కార్డులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం 4,46,168 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ 15 రోజుల్లోగా రేషన్ కార్డులు ఇచ్చే పక్రియను పూర్తిచేయాలని మంత్రివర్గం సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో నాలుగున్నర లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు అందనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 87.43 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటి వల్ల సుమారు 2.83 కోట్ల మంది లబ్ధిదారులకు రూపాయికి కిలో బియ్యం అందుతున్నాయి. కొత్త కార్డులు ఇవ్వాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య సుమారు 92 లక్షలకు పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా సొంతంగా సుమారు 34 లక్షల కార్డులకు ఉచితంగా రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నది. లాక్ డౌన్ సమయంలో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులు లేకపోవడంతో కొంతమందికి ఉచిత బియ్యం లభించలేదు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వీరు కూడా ఉచిత రేషన్ బియ్యం అందుకోనున్నారు.

ఇకపోతే రాష్ట్రంలో బియ్యం అక్రమ రావాణా అవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇది కొందరికి ఆదాయవనరుగా మారింది. ఉమ్మడి జిల్లా మహారాష్ట్రకు అతి సమీపంలో ఉండటం, అక్కడ బియ్యం ధర అధికంగా ఉండటంతో పేదల ఆకలి తీర్చాల్సిన రాయితీ బియ్యాన్ని అక్రమార్కులు ఇంతకాలం సొమ్ము చేసుకుంటూ వచ్చారు. లాక్డౌన్ తో రవాణా ఆగినా మళ్లీ తిరిగి పుంజుకోవడం ఖాయమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే రోడ్డుసైడ్ ఫలాహార బండ్లకు కూడా ఈ బియ్యం సరఫరా అవుతున్నాయని, ఇది బాహాటంగా జరిగే వ్యాపారమని అంటున్నారు. రాయితీ బియ్యం అక్రమ రవాణాను కొందరు వృత్తిగా మార్చుకున్నారు. రైళ్లలో అక్రమ రవాణా జరుగుతున్నా, బియ్యాన్ని పోలీసులు పట్టుకోవడం నిత్యం జరుగుతున్నా అవకతవకలకు అడ్డుకట్ట పడలేదు. దీనిపై సమీక్షించి కఠినంగా వ్యవహరించడంతో పాటు కిలో రూపాయిని కనీసం ఐదు రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తాన్ని రైతులకు మద్దతు ధరలకు కేటాయిస్తే మరీ మంచిది. వేలకోట్లు దండగమారి పథకానికి ఖర్చు చేస్తున్నారు. ఎపి విడిపోయిన తరవాత కూడా ఇంకా ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా వేలకోట్లు వృధా అవుతున్నాయి. ఎన్టీఆర్ తరవాత చంద్రబాబు సిఎం అయ్యాక దానిని ఐదు రూపాయలకు పెంచారు. దీంతో కొంత దుబారా తగ్గిందనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిక మళ్లీ కిలో రెండు రూపాయలకు చేశారు.

ఇలా చేయడం వల్ల కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు దాగి ఉన్నాయి. దీనిని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కిలో రూపాయికే మార్చడం ద్వారా అక్రమాలకు తెరలేపారు. కిలో రూపాయికి బియ్యం ఇవ్వడం వల్ల వ్యాపారులకు లాభాలు చేకూర్చే పథకంగా మారింది. వేలకోట్లు ఈ పథకం కోసం ఖర్చవుతున్నా మళ్లీ సమీక్ష చేయలేక పోతున్నారు. ఎక్కడ ఓట్లు పోతాయో అన్న భయం నాయకులను వెన్నాడుతున్నట్లుగా ఉంది. రేషన్ కార్డులు తగ్గించడమంటే పేదవారికి బియ్యం అందకుండా అడ్డుకోవడం కాదు. రేషన్ బియ్యం తినే ప్రతి ఒక్కరికీ బియ్యం అందిస్తాం అంటూ ప్రజలు కట్టే పన్నులకు పాతరేస్తున్నారు. చౌకధరలకు తీసుకుని బయట అమ్ముకునే వారిని గుర్తించి తొలగించడం లేదు. కార్డులు తగ్గించడం కన్నా అక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. పేదలకు బియ్యం అందించాలన్న సదుద్దేశ్యాన్ని ఎవరూ కాదనలేరు. కానీ రూపాయికే ఇవ్వాలనుకోవడం, అలా ఇచ్చిన బియ్యం అక్రమంగా తరలకుండా కఠినంగా చర్య తీసుకోకపోవమే ఆక్షేపణీయం. ఇకపోతే డీలర్ల మాయాజాలం కూడా దీనికి తోడవుతోంది. మారుమూల గ్రామాల్లో నేటికీ ఇదే తంతు కొనసాగుతోంది. ఈ పాస్ పెట్టినా ఫలితం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. మూడు పూటలా తిండికి నోచుకోని నిరుపేదలు కిలోమీటర్ల దూరంలోని రేషన్ దుకాణాల్లో సరకులు తీసుకోవడానికి ఆర్థిక భారమైనా రవాణా ఛార్జీలు భరిస్తూ, నానాపాట్లు పడుతున్నా మారుమూల, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నేరుగా బియ్యం పంపిణీ చేస్తే ఎలాంటి ఆక్షేపణా ఉండదు. కానీ అలా జరగడం లేదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి