స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ లీడర్ డా.కోట రాంబాబు
ఖమ్మం, 19 సెప్టెంబర్(జనవిజయం): మధిర లోని స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరి మీద ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు