–— జర్నలిస్టులకు అండగా ఉండటమే టీజేఎఫ్ లక్ష్యం
— టియూడబ్ల్యుజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ
ఖమ్మం, ఆగస్టు 14 (జనవిజయం): జర్నలిస్టుల సౌకర్యార్థం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ఉచిత వైఫై సేవలను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ప్రారంభించారు.
టియూడబ్ల్యూజే (టిజెఎఫ్) ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన ఉచిత వైఫై విస్తృత సేవలను జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి స్విచ్ ఆన్ చేసి సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్ నెట్ ఎంతో అవసరమని అన్నారు. జర్నలిస్టులకు అవసరమయ్యే రీతిలో 150 ఎంబిపిఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ వంటి సేవలను వినియోగంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అత్యంత వేగం గల ఇంటర్ నెట్ సేవలను జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చి వారి అవసరాలకు అనుగుణంగా యూనియన్ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు అవసరమయ్యే మౌలిక వసతులు, ఆటవిడుపుగా ఉండేందుకు క్యారమ్స్ బోర్డులు, ఆహ్లాదకరంగా ఉండేందుకు పూల మొక్కల ఏర్పాటు వంటి వసతులను ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి విషయంలో జర్నలిస్టులకు అండగా ఉండడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టుల సంక్షేమాభివృద్దే ధ్యేయంగా ప్రెస్ క్లబ్ ను దిన దినాభివృద్ది చేయడం సంతోషదాయకమని, ప్రెస్ క్లబ్ కమిటీని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, సహాయ కార్యదర్శి జీవన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, నగర ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి అశోక్, నాయకులు పొన్నెబోయిన పానకాలరావు, హుస్సేన్, కృష్ణారావు, ప్రభాకర్ రెడ్డి, రోసిరెడ్డి, అంతోటి శ్రీనివాస్, వెంపటి నాయుడు, ఆర్.కే, మోహన్, ఉపేందర్, భూక్య శ్రీనివాస్, మురళి, నాగేశ్వరావు, గుండు శ్రీను, రామచంద్రరావు, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, గణేష్ , కరీం తదితరులు పాల్గొన్నారు.