ఖమ్మం, ఆగష్టు 27(జనవిజయం): ఖమ్మం లో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఈమేరకు అన్ని రాజకీయ పక్షాలు తీర్మానాలు చేయాలని,ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో లో చోటు కల్పించాలని యస్ఆర్& బిజీయన్ఆర్ పూర్వ విద్యార్ధుల కార్యవర్గం తీర్మానం చేసినట్లు పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షులు నల్లమోతు తిరుమల రావు తెలియజేశారు.ఆదివారం ఖమ్మం లో జరిగిన కార్యవర్గం తీర్మాణాలు పత్రికలకు విడుదల చేశారు.అదే విధంగా కళాశాల భూరి విరాళం,భూవిరాళం దాత గెంటేలనారాయణరావు పేరు ఇల్లెందురోడ్డుకు నామకరణం చేయాలని, నిలువెత్తు నారాయణ రావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని, కళాశాల ను యూనివర్సిటీ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని, కళాశాల నిర్మాణం సమస్యలు పరిష్కారం చేయాలని,పై సమస్యలపై రాజకీయ పక్షాలు ఆలోచన చేయాలని సమావేశం తీర్మానించింది.త్వరలో డిమాండ్ల సాధనకోసం కార్యాచరణ రూపొందించిన్నట్లు ఆయన తెలిపారు.తిరుమలరావు అద్యక్షతన జరిగిన కార్యవర్గం సమావేశం లో యం.పుల్లయ్య,కత్తి నెహ్రూ, ఇస్మాయిల్,జి.ఆనంద్,యస్ మణిభూషనా చారి, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, యం.గుట్టయ్య, నాళ్ళ బానూచందర్, భూతం వసంతరావు తదితరులు పాల్గొన్నారు.భవిష్యత్ కార్యాచరణ గురించి సమగ్రంగా సమావేశం లో చర్చించనైనది.